వైరల్: నువ్వు మృగరాజు అయితే నాకేంటి అంటోన్న తాబేలు..!

చిన్న పిల్లాడిని అడిగిన అడివికి రాజు ఎవరు అంటే టక్కున సింహం అని చెప్పేస్తాడు.ఎందుకంటే సింహానికి అంత బలం ఉంది కాబట్టి.

 If You Are A Beast King What Kind Of Tortoise Is Mine-TeluguStop.com

ఎవరయినా సరే సింహాన్ని చూసి గడ గడ లాడాలిసిందే.అందుకే సింహాన్ని మృగరాజు అని, అడవికి రారాజు అని అభివర్ణిస్తారు.

సింహం ఒక్కసారి గర్జన చేస్తే చాలు ఎక్కడి జంతువుల అక్కడ గప్ చుప్ అయిపోతాయి.సింహం బలం తెలిసిన ఏ జంతువులు కూడా దానితో పోరుకి సిద్ధం అవ్వవు.

 If You Are A Beast King What Kind Of Tortoise Is Mine-వైరల్: నువ్వు మృగరాజు అయితే నాకేంటి అంటోన్న తాబేలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఇక్కడొక జీవి మాత్రం సింహనికి ఎదురెళ్ళింది.సింహంతో పోటీ పడిన ఆ జీవి ఏంటో తెలిస్తే మీరే ముక్కున వేలు వేసుకుంటారు.ఆ జీవి మరెవరో కాదు నీటిలో జీవించే తాబేలు.ఏంటి షాక్ అయ్యారా.? తాబేలు ఏంటి సింహాన్ని ఢీ కొట్టటం ఏంటి అని అనుకుంటున్నారా కావాలంటే మీరే ఈ వీడియో చూడండి.నిజం ఏంటో తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.తాబేలు ధైర్యాన్ని చూసి ప్రతి ఒక్క నెటిజన్ కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.ఓ సోషల్ మీడియా యూజర్ తన ఇంస్టాగ్రామ్ లో అద్భుతమైన వీడియోను పోస్ట్ చేశారు.అది కాస్తా క్షణాల్లో వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ గా మారింది.అసలు ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఒకసారి పరిశీలిస్తే ఒక సింహం నీటిని తాగడానికి నది ఒడ్డుకు వస్తుంది.

అలా నీరు తాగుతున్న సమయంలో సడెన్ గా ఓ తాబేలు దాని దగ్గరకు వస్తుంది.

ప్రశాంతంగా నీళ్లు తాగుతున్న సింహాన్ని కెలకడమే కాకుండా దాన్ని బెదరగొట్టింది.సర్లే కదా అని సింహం పక్కకి వెళ్లి నీళ్లు తాగుదామనుకున్నది కానీ అది కుదరలేదు.సింహం ఎక్కడికి వెళ్తే అక్కడకు తాబేలు కూడా వెళ్తుంది.

ఈ వీడియో చూడడానికి ఒక పక్కా ఫన్నీ గా ఉన్నా మరొకపక్క సింహం తాబేలును ఏమి చేస్తుందో అనే ఆత్రుత కూడా ప్రతి ఒక్కరిలో ఉంది.ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా ఇష్టపడడంతో పాటు వరస పెట్టి కామెంట్స్ మీద కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

సింహంతో ఆట అత్యంత ప్రమాదకరం అని తాబేలును ఉద్దేశించి ఒకరంటే.ఈ తాబేలుకు ఎమన్నా మైండ్ పోయిందా అని మరొకరు అంటున్నారు.సింహం మంచి మూడ్ లో ఉండబట్టి ఈరోజు తాబేలు ప్రాణాలతో బయట పడిందని మరొకరు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు