ఆ దేశంలో మ‌హిళ‌ల పోస్ట‌ర్లు క‌నిపిస్తే వైట్ పెయింట్ వేసేస్తున్నారు.. ఎందుకంటే?

దాదాపు ఇర‌వై ఏండ్ల త‌ర్వాత ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌ళ్లీ తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.దీంతో అక్క‌డ మ‌ళ్లీ హింసా రాజ్యం చెల‌రేగిపోతోంది.

 If Womens Posters Are Seen In That Country They Are Being Painted White Because,-TeluguStop.com

అక్క‌డి తాలిబ‌న్లు అనూహ్యంగా బ‌లం పెంచుకుని స‌ర్కార్‌ను కూల్చేశారు.ఇక ఇక్క‌డ తాలిబ‌న్లు ఇలా అధికారంలోకి వ‌చ్చారో లేదో దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు.

వేలాది మంది దేశం విడిచి వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు క్యూ క‌డుతున్నారు.ఇక వీరి పాల‌న అంటేనే ఎంత రాక్ష‌సంగా ఉంటంఉదో అంద‌రికీ తెలిసిందే.

ఇక ఇప్పుడు వీరి పాల‌న‌లో బ్రతికేందుకే మ‌హిళ‌లు గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు.

ఇక వీరు వ‌చ్చీ రాగానే ప్రత్యేకమైన నిబంధనలు ఏర్పాటు చేస్తూనే మ‌హిళ‌ల‌పై క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధిస్తున్నారు.

వారు ఎక్క‌డ కనిపించినా ఒంట‌రిగా రావొద్ద‌ర‌ని ఆదేశాలు జారీ చేస్తున్నారు.ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ప‌లు చోట్లు రోడ్లపై మహిళా పోస్టర్లకు వైట్ పెయింట్ వేసేస్తున్నారు తాలిబ‌న్లు.

ప‌లు కంపెనీలు, పెద్ద పెద్ద కాంప్లెక్సులు ఇప్ప‌టికే కొన్ని అడ్వర్టైజ్మెంట్‌లలో వెడ్డింగ్ డ్రెస్ లలో వేయించిన పోస్ట‌ర్ల‌ల‌లో మహిళల ఫొటోలు క‌నిపించ‌కుడా ఏకంగా పెయింట్ వేసేస్తున్నారు.ఇక దీంతో ఇప్పుడు అస‌లు మ‌హిళ‌లు అనేవారు బ‌య‌ట తిర‌గ‌డానికే భ‌య‌ప‌డుతున్నారు.

Telugu Afghanisthan, Talibans, White Paint, Womens Posters-Latest News - Telugu

ఇక తాలిబ‌న్లు ఇలా పోస్ట‌ర్ల‌కు పెయింట్ వేస్తున్న ఫొటోలు కాస్త ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.ఒక్క అడ్వ‌ర్ట‌యిజ్ మెంట్ ఫొటోల‌కే కాదు బ్యూటీ సెలూన్లు, బట్టల దుకాణాల బయట ఉన్న పోస్ట‌ర్ల‌కు సైతం ఇలాగే వైట్ పెయింటింగ్ రోలర్ తో క‌నిపించ‌కుండా చేస్తున్నారు తాలిబ‌న్లు.ఇక మ‌హిళ‌ల హక్కులను తాము గౌరవిస్తామ‌ని, కాక‌పోతే వారు ఎక్క‌డ బ‌య‌ట‌కు వ‌చ్చినా స‌రే బుర్ఖా తప్పనిసరిగా పాటించాల‌ని ఆదేశాలు ఇస్తున్నారు.ఇక మహిళలు బయటకు వ‌స్తే క‌చ్చితంగా వారి వెంట మగాళ్లెవరైనా సపోర్ట్ ఉండాలని వెల్ల‌డిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube