పదవి ఇస్తాం వద్దంటే వేటు వేస్తాం ! అసంతృప్తులకు క్లారిటీ ఇచ్చేస్తున్న కేసీఆర్

బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ విడుదల చేసిన దగ్గర నుంచి ఆ పార్టీలో ప్రకంపనాలు చోటు చేసుకుంటున్నాయి .

పార్టీ విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

మరి కొంతమంది నేతలు ఇతర పార్టీలు చేరేందుకు సిద్ధమయ్యారు.అయితే ప్రస్తుతం ప్రకటించిన జాబితా ఫైనల్ కాదని , ఈ జాబితాలోని అభ్యర్థుల కు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో మరోసారి సర్వే నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.

ఈ సర్వే నివేదిక ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఫైనల్ లిస్టును కేసీఆర్( CM KCR ) ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టికెట్ దక్కని నేతలు అసంతృప్తికి గురై పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో,  కేసీఆర్ ముందుగా బుజ్జగింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు .అసంతృప్త నేతలను బుద్ధగించేందుకు పార్టీకి చెందిన కీలక నేతలను రంగంలోకి దింపారు.ఈ సందర్భంగా కొంతమందికి నామినేటెడ్ పదవులను ఇస్తామని హామీ ఇస్తున్నారు .మరికొందరికి పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కీలకమైన పదవులు ఇస్తామనే హామీలు ఇస్తున్నారు అయితే ఆ హామీలతో కొంతమంది అలక వీడుతుండగా, మరి కొంతమంది మాత్రం అసెంబ్లీ టికెట్ మినహా వేరే ఏవి తమకు అవసరం లేదని చెప్పేస్తున్నారు.దీంతో నామినేటెడ్ పదవులు ఇస్తామన్నా ససేమేరా అంటున్న నేతలపై వేటు వేసేందుకు వారి బంధువుల్లోని ఉద్యోగస్తులను అప్రాధాన్య పోస్టుల్లో కి పంపించేందుకు నిర్ణయించుకున్నారట.

ఇప్పటికే కొంతమందికి ఆ విధంగా పనిష్మెంట్ ఇచ్చినట్లు సమాచారం.ప్రస్తుతం టికెట్ దక్కని అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నా.మాట వినని వారు ఎవరెవరు ఉన్నారు ?  ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు అసంతృప్తితో ఉన్నాడు ?  పార్టీ మారితే ఎంత మేరకు ప్రభావం ఉంటుంది అనే విషయం పైన సమగ్రంగా ఆరా తీస్తున్నారట.

Advertisement

వేములవాడ విషయానికొస్తే అక్కడ టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పార్టీ( MLA Chennamaneni Ramesh ) మారే ఆలోచనతో ఉండడంతో,  ముందుగా పట్టించుకోనట్టుగా వ్యవహరించినా .ఆయన సహకారం లేకపోతే వేములవాడలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశం లేదని గుర్తించిన కేసీఆర్ ఆయనకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పదవిని కట్టబెట్టారు .క్యాబినెట్ హోదా కలిగిన ఈ పదవిపై ఆయన సంతృప్తి చెందారు.ఇక పఠాన్ చెరువు టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పదవిని ఇచ్చారు.

ఇక ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్( Bonthu Ram Mohan ) బిజెపిలోకి వెళ్లే ఆలోచనతో ఉండడంతో,  ఆయనకు మున్సిపల్ శాఖ పరిధిలోని ఓ కీలక నామినేటెడ్ పదవిని ఇచ్చేందుకు కెసిఆర్ నిర్ణయించుకున్నారట.కల్వకుర్తి టికెట్ కోసం ప్రయత్నించిన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓ బిఆర్ఎస్ నాయకుడికి ఇప్పుడు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చేందుకు కెసిఆర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ఇదేవిధంగా అసంతృప్తితో ఉన్న కీలక నేతలకు వివిధ నామినేటెడ్ పదవులు ఇచ్చి బుజ్జగించాలని నిర్ణయించుకున్నారు.

ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ కు సీటు దక్కకపోవడంతో,  ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.దీంతో ఆమెకు పనిష్మెంట్ గా మహబూబాబాద్ ఎస్పీగా ఉన్న ఆమె అల్లుడు శరత్ చంద్ర పవార్ ను అక్కడి నుంచి బదిలీ చేసి పోలీస్ అకాడమీకి అటాచ్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కీలక నేత శ్రీహరి రావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడంతో,  హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని లా అండ్ ఆర్డర్ విభాగంలో పనిచేస్తున్న ఆయన సమీప బంధువు పైన బదిలీ వేటు వేసినట్లు సమాచారం.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

ఇదేవిధంగా కొంతమంది అసంతృప్తులపై నేరుగా వేటు వేస్తుండగా,  మరి కొంతమంది విషయంలో వారి బంధువులను టార్గెట్ చేసుకున్నారనే విమర్శలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు