Venkatesh Ori Devuda: వెంకటేష్ లేకుంటే బాగుండేది.. ఓరి దేవుడాపై పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఓరి దేవుడా.అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 If-venkatesh Wasnt There Paruchuri Gopalakrishnas Review Of Ori Devuda Venkatesh-TeluguStop.com

ఇక ఈ సినిమాలో వెంకటేష్ దేవుడి పాత్రలో సందడి చేశారు.ఇలా దీపావళి కానుకగా విడుదలైనటువంటి ఈ సినిమా థియేటర్లో మిశ్రమ స్పందన దక్కించుకుంది.

ఇకపోతే తాజాగా విశ్వక్ నటించిన ఈ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ తనదైన శైలిలో తన విశ్లేషణను తన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఓరి దేవుడా చిత్రాన్ని తమిళంలో ఎంతో విజయవంతమైనటువంటి ఓ మై కడువులే సినిమాని తెలుగులోకి రీమేక్ చేశారు.

ఇక ఈ సినిమా గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి సినిమాలకు ఈ విధమైనటువంటి టైటిల్స్ పెట్టడం చాలా గొప్ప సాహసం అని ఈయన వెల్లడించారు.

ఇలాంటి సినిమాలలో ప్రతి ఒక్క సన్నివేశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించడం చాలా కష్టమని అయితే ఇందులో ఏ విధమైనటువంటి చిన్న తప్పు దొర్లిన ప్రేక్షకులతో కనెక్టివిటీ పోతుందని ఈయన తెలిపారు.

ఈ సినిమాలో అలాంటి తప్పులు దుర్లాయేమోనని ఈయన సందేహం వ్యక్తం చేశారు.ఇక చిన్ననాటి స్నేహితుల మధ్య జరిగిన ప్రేమ కథ గురించి ఈ సినిమాలో చూపించారు.

అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా లవ్ స్టోరీ సినిమాలో వస్తున్నాయని ఇలా లవ్ స్టోరీ తో వచ్చిన సినిమాలు మంచిగానే ఆదరణ పొందుతున్నాయని తెలిపారు.

Telugu Ori Devuda, Rajendra Prasad, Review, Tollywood, Venkatesh, Viswak, Viswak

ఈ సినిమా మధ్యలో కొన్ని సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.అలాగే క్లైమాక్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉందని పరుచూరి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.ఈ మధ్యకాలంలో చాలామంది భార్య భర్తలు విడిపోవాలని లేకున్నా కోర్టు వరకు వస్తున్నారని విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

అయితే ఈ సినిమాకు ఓరి దేవుడా అనే టైటిల్ కరెక్ట్ కాదేమోనని తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Telugu Ori Devuda, Rajendra Prasad, Review, Tollywood, Venkatesh, Viswak, Viswak

ఇక స్క్రీన్ ప్లే విషయంలో కూడా మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండేదని తెలిపారు ఇక వెంకటేష్ పాత్ర గురించి మాట్లాడుతూ వెంకటేష్ ఈ సినిమాలో దేవుడి పాత్రలో నటించారా లేక దేవుడికి ప్రతినిధి పాత్రలో నటించారా అర్థం కాలేదని తెలిపారు.నిజానికి ఈ సినిమాలో వెంకటేష్ లాంటి హీరోలను పెట్టుకోవడమే పెద్ద తప్పు.ఇలాంటి కామెడీ తరహా పాత్రలలో వెంకటేష్ లాంటి స్టార్ హీరోలను తీసుకొని వారి హోదాను తగ్గించినట్లు అవుతుందని ఈయన భావించారు.

ఈ సినిమాలో వెంకటేష్ కి బదులుగా రాజేంద్రప్రసాద్ వంటి హీరోలను తీసుకొని ఉంటే బాగుండేదని తెలిపారు.అద్భుతమైన కథాంశంతో ఆకాశాన్ని చేరుకోవాల్సినటువంటి ఈ సినిమా కొన్ని లోపాల కారణంగా మధ్యలోనే ఆగిపోయిందని ఈయన ఓరి దేవుడా సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube