యాదాద్రి జిల్లా:ఇందిరమ్మ పాలనను దేశ ప్రజలు ఇప్పటికీ తలుచుకుంటున్నారని,ఏం అభివృద్ధి చేశారని టిఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేయాలి?పెట్రోలు, డీజిల్,గ్యాస్,ఇతర నిత్యవసర సరుకుల ధరలు పెంచినందుకా?పెళ్ళాం పిల్లలు లేని మోడీకేం తెలుస్తది ప్రజల బాధ,పాలు పెరుగు పైన జీఎస్టీ వేసిన బీజేపీకి ఓటయ్యాలా? ఇప్పటికే రెండుసార్లు అధికారంలో కొచ్చి తెలంగాణాను దోపిడీ చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మళ్ళీ గెలిపిస్తే కేసీఆర్ బందిపోటు దొంగలాగా మారి తెలంగాణ ప్రజలను పట్టపగలే దోచ్చుకుంటాడని,సొంత గ్రామానికి రోడ్డు వేయలేని కూసుకుంట్లను ఎందుకు గెలిపించాలని బీజేపీ, టీఆర్ఎస్ లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.శుక్రవారం మునుగోడు ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం, అభివృద్ధి కోసం కొట్లాడినందుకు తనపైన 100కు పైగా కేసులు పెట్టారని,తెలంగాణ ప్రజల కోసం,అస్తిత్వం కోసం వందసార్లైనా జైలుకు వెళ్తా,చిప్పకూడు తింటానని అన్నారు.
కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి జరుగుతుందని,సాగర్,నెట్టెంపాడు,హైదరాబాద్ విజయవాడ హైవే లాంటి అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్ కి ఓటు వేయండని కోరారు.పాల్వాయి స్రవంతిని సొంత ఆడుబిడ్డగా చూసుకొని గెలిపిస్తే పావలా వడ్డీ గురించి మాట్లాడుతదని,మహిళల సాధికారత కోసం ఓటు వేయండని పిలుపునిచ్చారు.