ఆ రెండు విష‌యాల‌ను లైట్ తీసుకుంటే వైసీపీకి న‌ష్ట‌మే..

ఏపీ రాజ‌కీయాల్లో వైసీపీది ట్రెండ్ సెట్ట‌ర్ పాలిటిక్స్ అనే చెప్పాలి.ఆ పార్టీని ఇప్ప‌ట్లో ఢీకొట్టే ప్ర‌త్య‌ర్థి లేడ‌నే చెప్పాలి.

 If Those Two Things Are Taken Lightly It Will Be A Loss To The Ycp-TeluguStop.com

ఇందుకు నిద‌ర్శ‌నంగా వ‌రుస ఎన్నిక‌ల్లో ఆ పార్టీ సాధిస్తున్న విజ‌యాలు నిలుస్తున్నాయి.అయితే ఇప్పుడు ఆ పార్టీ కొంత అప్ర‌మ‌త్తం కావాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌నే చెప్పాలి.

ఎందుకంటే రీసెంట్ గా వెల్లడైన పరిషత్ ఫలితాలు చూస్తుంటే అర్థం అవుతోంది.ఈ ఫలితాల్లో వైసీపీనే తిరుగులేని మెజార్టీ సాధించినా కూడా రెండు విష‌యాలు చాలా ఇబ్బందిక‌రంగా మారుతున్నాయి.

 If Those Two Things Are Taken Lightly It Will Be A Loss To The Ycp-ఆ రెండు విష‌యాల‌ను లైట్ తీసుకుంటే వైసీపీకి న‌ష్ట‌మే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక‌టేంటంటే కొన్ని మండలాల్లో వైసీపీ ఎమ్మెల్యేల స్థానిక నాయ‌కులు ఎదురుతిరుగుతున్నారు.

ఇక రెండోది ఏంటంటే టీడీపీతో జనసేన ఎనిమిది మండలాల్లో చేతులు క‌లిపి అధికారాన్ని ద‌క్కించుకోవ‌డం.

ఇక చాలా మండ‌లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు డిసైడ్ చేసిన ఎంపీపీ క్యాండిడేట్‌కు గెలిచిన ఎంపీటీసీలు మ‌ద్ద‌తు తెల‌ప‌క‌పోవ‌డం పెద్ద‌ స‌మ‌స్య‌గా మారింది.రీసెంట్ గా ఆముద‌లవలస ఎమ్మెల్యే అయిన స్పీకర్ తమ్మినేని నిర్ణ‌యించిన క్యాండిడేట్ ను ఎంపీపీగా ఎన్నుకునేందుకు ఎంపీటీసీలు ముందుకు రాలేదు.

ఇక అలాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విష‌యంలో కూడా ఇలాగే జ‌రిగింది.ఆయ‌న సూచించిన వ్యక్తికి ఎంపీటీసీలు అడ్డుత‌గిలారు.

Telugu Ap Cm Jagan, Ap Politics, Chandrababu Naidu, Janasena, Mlc Duvvada Srinivas, Mptc Elections, Pawan Kalyan, Speaker Tammineni, Tdp, Tdp Janasena Alliance, Ycp-Telugu Political News

ఇలా ఎంపీటీసీలు ఎదురుతిరుగుత‌న్న నియోజకవర్గాలు దాఆపు 10 వ‌ర‌కు ఉన్నాయి.వీటిల్లో వైసీపీ అల‌ర్ట్ అయి లోక‌ల్ నాయ‌కుల‌ను త‌మ‌వైపు తిప్పుకోక‌పోతే ప్ర‌మాద‌మ‌నే చెప్పాలి.ఇంక మ‌రో విష‌యం ఏంటంటే ఎనిమిది మండ‌లాల్లో టీడీపీ అలాగే జనసేనలు క‌లిసిపోవ‌డం వ‌ల్ల అక్క‌డ వైసీపీ అధికారాన్ని చేజింక్కించుకోలేక‌పోయింది.ఇక జ‌న‌సేన ఈ ఎన్నికల్లో 177 ఎంపీటీసీలను ద‌క్కించుకుందంటే చిన్న విష‌యం కాదు.

ఎలాంటి స‌పోర్టు లేని పార్టీ అన్ని సీట్లు సాధించిందంటే రాబోయే రోజుల్లో మ‌రింత బ‌ల‌ప‌డే ఛాన్స్ ఉంది.ఇక టీడీపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటే అది మ‌రింత ప్ర‌మాద‌మ‌నే చెప్పాలి.

ఈ రెండు విష‌యాల్లో వైసీపీ అల‌ర్ట్ కాక‌పోతే ప్ర‌మాద‌మే.

#AP #Chandrababu #Pawan Kalyan #Mptc #Tammineni

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు