ఈ రోబో ఇంట్లో ఉంటే దొంగల పని ఖతం..!

ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది.ఏది కావాలన్నా నెట్టింట్లో దొరికిపోతుంది.

 If This Robot Is At Home, The Work Of Thieves Will Be Over. Robo, Theif, Viral L-TeluguStop.com

ఇంటి నుంచి బయటకి వెళ్లకుండా అన్నీ ఆన్ లైన్ లోనే లభిస్తున్నాయి.ఆన్ లైన్ లో అప్లై చేసుకుంటే అన్నీ ఇంటికే వచ్చేస్తున్నాయి.

ప్రస్తుతం టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది.రోబో టెక్నాలజీ శరవేగంగా డెవలప్ అవుతోంది.

మనుషులు చేసే పనులన్నీ రోబోలు చేసేస్తున్నాయి.మనుషులు అవసరం లేకుండానే రోబోలు పనులన్నీ చేసేస్తున్నాయి.

ఇంటి పనులతో పాటు హోటల్, రెస్టారెంట్, హాస్పిటల్స్ ఇలా.అనేక రంగాల్లో రోబోలను ఉపయోగించుకుంటున్నారు.మానవులకు రోబోలు చాలా సహయపడుతున్నాయి.తాజాగా ఇంటికి కాపలా ఉండేలా రోబోను తయారుచేశారు.మాములుగా డాగ్స్ ను ఇంటికి సెక్యూరిటీ కోసం పెంచుకుంటారు.కానీ రోబో డాగ్స్ కూడా వచ్చేశాయి.

ఇంటికి కాపలా కోసం వీటిని ఉపయోగిస్తున్నారు.తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రష్యాకు చెందిన అలెగ్జాండర్ ఆటామానోవ్ ఈ రోబోను రూపొందించారు.ఈ రోబోను ఇంటి ముందు పెట్టారు.దీనికి ఆటోమేటిక్ మెషిన్ గన్ ను పెట్టారు.ఈ రోబోకి ఉన్న గన్ ను తుపాకీ రష్యన్-పీపీ-19 విత్యాజ్, ఏకే-74 డిజైన్ ఆధారంగా రూపొందించారు.ఇవి ఆటోమేటిక్ మెషిన్ గన్ ద్వారా కాల్పులు జరుపుతాయి.అలెగ్జాండర్ ఆటామానోవ్ హోవర్ సర్ప్ అనే ఏరోపరిశ్రను నడుపుతున్నాడు.

కాలిఫోర్నియాలోని శాస్ జోస్ లో ఇది ఉంది.ఈ రోబో డాగ్ కు గన్ పెట్టడం.

ఇలాంటివి అవసరమా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.ఇలాంటి రోబోలో మనుషులపై దాడి చేస్తే యజమానులు నేరం నుంచి తప్పించుకోవడం చాలా సలభం అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి వాటి వల్ల ప్రమాదం కూడా పొంచి ఉందంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube