అక్కడికి వారు వస్తే ... మేము ఆత్మహత్య చేసుకుంటాం   If They Come There ... We Commit Suicide     2018-10-16   16:21:44  IST  Sai M

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల అమలును వ్యతిరేకిస్తూ కేరళలో వేల మంది బీజేపీ కార్యకర్తలు, అయ్యప్ప భక్తులు తిరువనంతపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. నెలవారీ పూజల నిమిత్తం బుధవారం అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోకి ప్రవేశించడానికి పలువురు మహిళలు సిద్ధమయ్యారు.

ఆలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే రాష్ట్రంలో భౌతిక దాడులు తప్పవని కొంతమంది హెచ్చరిస్తే, శబరిమలకు మహిళలు వస్తే ఆత్మహత్య చేసుకుంటామని శివసేన కార్యకర్తలు బెదిరింపులకు దిగారు. అటు సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించింది. ఆలయం విషయంలో ప్రతిష్టంభన తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కేరళ బీజేపీ అల్టిమేటం జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్రిక్తత పెరిగింది.