స్మార్ట్ ఫోన్లో ఈ మార్పులు కనిపిస్తే.. ఫోన్ హ్యాకింగ్ కు గురైనట్టే.. జాగ్రత్త..!

ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్( Smart phone ) వాడడం తప్పనిసరిగా మారిపోయింది.కాసేపు స్మార్ట్ ఫోన్ లేకపోయినా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి.

 If These Changes Are Seen In The Smart Phone Then The Phone Has Been Hacked ,sma-TeluguStop.com

ఇక సైబర్ నేరగాళ్లు స్మార్ట్ ఫోన్ లను హ్యాకింగ్ చేయడానికి కొత్త కొత్త వైరస్ లను సృష్టించి అమాయక ప్రజలను దోచుకుంటున్నారు.స్మార్ట్ ఫోన్లో ఈ మార్పులు కనిపిస్తే ఫోన్ హ్యాకింగ్( Phone hacking ) కు గురైనట్టే.

ఫోన్ వాడకపోయినా బ్యాటరీ త్వరగా అయిపోవడం, మొబైల్ డేటా( Mobile data ) వాడకపోయినా అయిపోవడం, లేదంటే డేటా కాస్త వాడినా కూడా ఎక్కువగా అయిపోవడం, ఫోన్ రన్నింగ్( Phone running ) లో ఉన్నప్పుడు యాప్స్ ఆటోమేటిక్ గా క్లోజ్ అవ్వడం, ఫోన్ దానంతట అదే రీస్టార్ట్ అవ్వడం, ఫోన్ వాడుతున్నప్పుడు వేగం పూర్తిగా తగ్గడం లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఫోన్ హ్యాకింగ్ కు గురైనట్టే.

Telugu Latest Telugu, Phone, Smart Phone, Software-Technology Telugu

కొన్ని సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్న ఫోన్లలో ఈ సమస్యలు వస్తే పర్వాలేదు కానీ కొత్త మొబైల్ లలో ఈ సమస్యలు వచ్చాయంటే ఫోన్ ఎవరో హ్యాక్ చేసినట్టే.కాబట్టి స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న వారు ఈ జాగ్రత్తలు గుర్తుంచుకోవాలి.తెలియని విదేశీ నెంబర్ నుండి వచ్చిన కాల్స్ ఎట్టి పరిస్థితులలోనూ లిఫ్ట్ చేయకూడదు.

ఫోన్ వినియోగంలో లేనప్పుడు మొబైల్ డేటా ఆఫ్ చేయాలి.ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఎట్టి పరిస్థితులలో చెప్పకూడదు.

Telugu Latest Telugu, Phone, Smart Phone, Software-Technology Telugu

తెలియని నెంబర్లనుండి ఫోన్ వస్తే వెంటనే ఆ నెంబర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలి.స్మార్ట్ ఫోన్ లో అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ ( Software update )చేయిస్తుండాలి.సోషల్ మీడియాలో వచ్చే వివిధ రకాల లింకులను ఎట్టి పరిస్థితులలో క్లిక్ చేయకూడదు.ముఖ్యంగా ఆఫర్లకు సంబంధించిన లింకులు సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తాయి వీటి నుండి జాగ్రత్తగా ఉండాలి.

సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.పేమెంట్ కోసం కేవలం ఒక యాప్ ను మాత్రమే వినియోగించాలి.

ఎవరైనా అకౌంట్లో డబ్బులు వేసి, పొరపాటున మీ ఖాతాలో డబ్బులు పడ్డాయి తిరిగి ఈ నెంబర్ కి పంపించండి అంటే ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube