కుదిరితే పొత్తు లేకపోతే .. ? షర్మిల పరిస్థితేంటో ? 

కాంగ్రెస్ ( Congress )తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలో లేక ఒంటరిగానే పోటీకి దిగాల అనే విషయంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( YS Sharmila ) కన్ఫ్యూజ్ అవుతున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తు విషయమై అనేకసార్లు సంప్రదింపులు చేశారు.

కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్( Dk Shivakumar ) ద్వారా కాంగ్రెస్ అధిష్టానం పెద్దల వద్ద రాయబారాలు చేశారు.కాంగ్రెస్ అధిష్టానం కూడా వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకునేందుకు అంగీకారం తెలిపినా,  తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.

షర్మిలను ఏపీ రాజకీయాలకే పరిమితం చేయాలని , తెలంగాణ కాంగ్రెస్ లో ఆమె సేవలు అవసరం లేదంటూ అధిష్టానం వద్ద తేల్చి చెప్పేసారు.

దీంతో షర్మిల పార్టీ విలీన ప్రక్రియ నిలిచిపోయింది .మరోవైపు చూస్తే తెలంగాణ కాంగ్రెస్ ( Telangana Congress )తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది .ఈ క్రమంలో షర్మిల పై ఒత్తిడి పెరుగుతోంది.తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని, వచ్చే ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు.

Advertisement

కానీ షర్మిలకు సరైన హామీ లభించకపోవడంతో ప్రస్తుతం ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయం పై తర్జనభజన పడుతున్నారు.ఈ వ్యవహారాలపై షర్మిల స్పందించారు .కాంగ్రెస్ లో తమ పార్టీ వీలైన ప్రక్రియ లేకపోతే వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీకి దిగబోతున్నట్లు షర్మిల ప్రకటించారు.ఈ మేరకు లోటస్ పాండ్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు .పార్టీ రాజకీయ నిర్ణయక కమిటీ,  రాష్ట్ర అధికార ప్రతినిధులు , 33 జిల్లాల కన్వీనర్లు,  నియోజకవర్గాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు.

ఈనెల 30వ లోపు విలీనంపై నిర్ణయం తీసుకుంటాం, ఎటు తేలకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటాం .119 నియోజకవర్గాల్లో వైయస్సార్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తుంది.  అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణను రూపొందిస్తున్నాం అని షర్మిల( YS Sharmila ) అన్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ బలం అంతంత మాత్రంగానే ఉంది.పార్టీలో బలమైన నాయకులు పెద్దగా లేరు.అయినా షర్మిల మాత్రం కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోతే సొంతంగానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని గంభీరంగా ప్రకటనలు చేస్తుండడం ఆ పార్టీ నాయకులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు