తప్పక తెలుసుకోండి : ఇంట్లో ఏసీ ఉంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి

ఎండాకాలం వచ్చిందంటే పక్కకు పడేసిన కూలర్లు మరియు ఎన్నో రోజులుగా వాడకుండా ఆపేసిన ఏసీలు మళ్లీ వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారు.అయితే ఏసీలు అత్యంత చల్లదనం ఇవ్వడంతో పాటు, హాయిగా నిద్రపోయేలా చేస్తాయి.

 If There Is Ac In The House Remember These Things-TeluguStop.com

కాని అవే ఏసీల వల్ల కొన్ని సమస్యలు కూడా ఉంటాయి.కాస్త జాగ్రత్తగా ఉండకుంటే అవే ఏసీలు అనారోగ్యం పాలు చేయడంతో పాటు, చివరకు చనిపోయేలా కూడా చేస్తాయంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏపీలు కొనేముందు, కొని ఇంట్లో పెట్టించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వాటి మెయింటెన్స్‌ విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఏసీలు కొనుగోలు చేసే సమయంలో ముఖ్యంగా స్ల్పిట్‌ ఏసీల కంటే విండో ఏసీలకు ప్రాముఖ్యత ఇవ్వండి.

ఎందుకంటే విండో ఏసీల మెయింటెన్స్‌ తక్కువ ఉండటంతో పాటు, పలు సౌలభ్యాలు ఉంటాయి.

తప్పక తెలుసుకోండి : ఇంట్లో ఏసీ

ఏసీ కొనే సమయంలో బ్రాండెడ్‌ కొనుగోలు చేయడం మంచిది.రెండు మూడు వేల రూపాయలు తగ్గుతుందనే ఉద్దేశ్యంతో నాసిరకం ఏసీలు కొనుగోలు చేయడం వల్ల అవి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఏసీలో నింపే గ్యాస్‌ విషయంలో కూడా తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.

గ్యాస్‌లో నాణ్యత ఉంటుంది, అందుకే నాణ్యమైన గ్యాస్‌ను నింపించుకుంటే మంచిది.

ఇక ఏసీలు ఏవైనా మరమత్తులు చేసే సమయంలో కాస్త వాటికి దూరంగా ఉంటే మంచిది.

ఏసీలో గ్యాస్‌ సిలిండర్‌ ఇంకా కొన్ని రకాల పేలుడు వస్తువులు ఉంటాయి.అవి అప్పుడప్పుడు పేళిపోయే అవకాశం ఉంది.

అందుకే వాటికి దూరంగా ఉండటం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube