ఒక ఫ్లాటు ఉంటే రెండుకు మించి కార్లు ఉండొద్ద‌ట‌.. కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌పంచం మొత్తం స‌క‌ల సౌక‌ర్యాల‌ను మాత్ర‌మే కోరుకుంటోంది.ల‌గ్జ‌రీ ఇల్లు, రెండు నుంచి మూడు కార్లు ఉండాల‌ని ఇప్ప‌టి త‌రం ఆశిస్తోంది.

 If There Is A Flat, There Are More Than Two Cars .. Court Sensational Comments,-TeluguStop.com

చిన్న ఇల్లుఉన్నా స‌రే కారు మాత్రం ఉండాల‌నే విధంగా త‌మ కోరిక‌లు ఉంటున్నాయి.ఇక ఇలా విప‌రీతంగా కార్లు కొనేయ‌డంతో రోడ్ల మీద ట్రాఫిక్ ఏ స్థాయిలో పెరిగిపోతుందో చూస్తూనే ఉన్నాం.

ఇప్ప‌టికే రోడ్లు సరిపోన‌న‌న్ని కార్లు జ‌నాల ద‌గ్గ‌రే ఉంటున్నాయి.దీంతో విప‌రీతంగా వాయు కాలుష్యం లాంటివి జ‌రుగుతున్నాయి.

దీంతో ఇలాంటి వాటి గురించి ఓ సెన్సేష‌న‌ల్ న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

దీనిపై స్పందిచిన బాంబే హైకోర్టు అపార్ట్ మెంట్స్ ల‌లో నివ‌సించే వారికి ఒక్క ప్లాట్ ఉంటే వాళ్లు ఒకటి లేదా రెండు కార్ల‌కు మించి వాడ‌కూడ‌ద‌ని, వారి కుటుంబంలో అంద‌రికీ క‌లిపి రెండు కార్ల కంటే ఎక్కువ ఉండొద్ద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

మ‌న దేశంలోనే అత్య‌ధికంగా అభివృద్ధి చెందిన న‌గ‌రాల్లో ముంబయి ఉంది.ఇక్క‌డ పార్కింగ్ సమస్య చాలా తీవ్రంగా ఉంటోంది.దీంతో ఈ విధ‌మైన కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి.ఈ క్ర‌మంలో బాంబే ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేయటం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Telugu Air, Bombay, Cars, Mumbai, Sensational-Latest News - Telugu

ముఖ్యంగా చెప్పాలంటే ముంబ‌యిలో అపార్ట్ మెంట్లలలో నివ‌సించే వార‌యితే ఒక్క ఫ్లాట్ ఉన్నా స‌రే కార్లు మాత్రం రెండు లేదంటే అంత‌కు మించి కావాలంటూ కొనేస్తున్నారు.ఇలా విప‌రీతంగా కార్లు కొనేయ‌డంతో చివ‌ర‌కు ముంబ‌యి రోడ్ల మీద ట్రాఫిక్ స‌మ‌స్య‌లు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి.ఇక ఎక్క‌డా పార్కింగ్‌కు ప్లేస్ స‌రిపోక చివ‌ర‌కు రోడ్ల మీదే కార్ల‌ను పార్క్ చేస్తున్నారు.దీంతో అక్క‌డ వీధుల్లో నివ‌సించే వారు వారి ఇండ్ల‌కు వెళ్ల‌డానికి కూడా వీలు లేకుండాపోతోంద‌ని ఓ సామాజిక కార్య‌క‌ర్త వేసిన పిటిష‌న్‌పై హైకోర్టు ఇలా స్పందించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube