ఇక నుంచి వీలునామా రాయకపోయినా తోబుట్టువులకు ఆస్తులు పంచివ్వాలి.. సుప్రీం తీర్పు

తండ్రి ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోతే అతడి ఆస్తి ఎవరికి చెందుతుందని ఇన్ని రోజులూ సందిగ్ధం ఉండేంది.ఈ సందిగ్ధానికి తెర దించుతూ సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది.

 If The Will Is Not Written From Now On, The Assets Should Be Distributed To The Siblings .. Supreme Judgment, , Viral News ,siblings , Supeme Court ,assets ,-TeluguStop.com

సుప్రీం వెలువరిచిన తీర్పుతో దేశంలో ఉన్న ఆడవాళ్లు ఆనందం వ్యక్తం చేస్తుంటే పురుషులు మాత్రం దిగులు చెందుతున్నారు.ఈ తీర్పు ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సుప్రీం చెప్పింది.

ఎవరైనా సరే ఈ తీర్పును ఉల్లంఘిస్తే శిక్షలు ఉంటాయని హెచ్చరించింది.ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.

 If The Will Is Not Written From Now On, The Assets Should Be Distributed To The Siblings .. Supreme Judgment, , Viral News ,siblings , Supeme Court ,assets , -ఇక నుంచి వీలునామా రాయకపోయినా తోబుట్టువులకు ఆస్తులు పంచివ్వాలి.. సుప్రీం తీర్పు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మద్రాసు హై కోర్టులో ఒక తీర్పు వచ్చింది.ఆ తీర్పు నచ్చని వ్యక్తి ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు.

అతడు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో సుప్రీం తీర్పును వెలువరించింది.ఈ తీర్పు ప్రకారం వీలునామా లేకపోయినా కానీ కుమార్తెలకు ఆస్తులు చెందుతాయని సుప్రీం కోర్టు చెప్పింది.2005 సెప్టెంబర్ 9 నాటికి తండ్రి బతికున్నా లేకున్న కుమార్తెకు వాటా చెల్లించాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది.ఆస్తుల విషయంలో దాయాదుల కంటే ఎక్కువగా కుమార్తెలకే హక్కులు ఉంటాయని తెలిపింది.

ఆడబిడ్డలకు తండ్రి ఆస్తులపై సమాన హక్కు ఉంటుందని సుప్రీం తీర్పు వెలువరించడంతో అందరూ ఒక్క సారిగా అటువైపు చూశారు.

ఇన్నాళ్లూ తండ్రి వీలునామా రాస్తేనే ఆడబిడ్డలకు ఆస్తులు వస్తాయని చెబుతూ వచ్చిన అందరికీ ప్రస్తుతం సుప్రీం తీర్పు పెద్ద షాకిచ్చింది.

ఇలా సుప్రీం తీర్పు ఇవ్వడంపై అనేక మంది అనేక విధాలుగా స్పందిస్తున్నారు.ఇది మంచి పరిణామమని మహిళలకు మేలు జరుగుతుందని కొంత మంది అంటుంటే.ఈ తీర్పు వలన ఇంకా గొడవలు పెరిగి కేసులు పెరిగే అవకాశం ఉందని మరికొందరు వాదిస్తున్నారు.మరి వేచి చూడాలి.

ఈ కొత్త చట్టం దేశంలో ఎటువంటి మార్పులను తీసుకొస్తుందో. ప్ర‌స్తుతం ఈ వార్త బాగా పాపుల‌ర్ అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube