పెళ్లిలో మాంగల్యధారణ సరైన సమయానికి జరగకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా పెళ్లి అనేది జీవితంలో జరిగే ముఖ్యమైన వేడుక.పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం వధూవరుల జాతకాలు పరిశీలించి వారి ఇద్దరి పేర్ల పై ఎలాంటి జాతక దోషాలు లేకుండా ఉన్నప్పుడు, అదేవిధంగా వారి పేర్ల పై ఎప్పుడైతే అమృత ఘడియలు ఉంటాయో అదే సమయానికి పెళ్లి ముహూర్తం నిర్వహిస్తారు.

 Mangalyadharana, Marriges, Perfect Time, Place, Hindu Belives-TeluguStop.com

ఇలా నిర్ణయించిన పెళ్లి ముహూర్తానికి మూడు ముళ్ళు పడాలని పెద్దలు చెబుతుంటారు.పూర్వకాలంలో పెళ్లి ఎలాంటి ఫోటోలు వీడియోలు లేకపోవటం వల్ల సమయానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారు.

కానీ ప్రస్తుత కాలంలో సమయాన్ని పక్కనపెట్టి ఫోటోలకు వీడియోలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.ఈ క్రమంలోనే పెళ్లి జరగాల్సిన సమయానికి జరగడం లేదు.

ఇలా సరైన సమయానికి మాంగల్యధారణ జరగకపోతే ఏం జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం….

పెళ్లిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ముహూర్త సమయానికి మూడు ముళ్ళు పడాలని పండితులు చెబుతుంటారు.

ముహూర్తం అనేది వారి పేర్ల బలాలపై నిర్ణయిస్తారు.అందుకే సరైన సమయంలో మాంగల్యధారణ జరగాలి అలా జరగకపోతే భార్య భర్తల మధ్య వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు ఉండవు.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, మనోవైకల్యం, మంచి సంతానాన్ని పొందక పోవడం వంటివి జరుగుతాయి.అందుకే పాశ్చాత్య సంస్కృతిని కొంత సమయం పాటు పక్కనపెట్టి సరైన సమయానికి మాంగల్యధారణ జరగాలని చెప్పారు.

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో అదే విధంగా పాశ్చాత్య సంస్కృతి మన దేశం పై పడటం వల్ల చాలా మంది పెళ్లి కన్నా ఎక్కువగా ఫోటోలకు వీడియోలకు సమయం కేటాయిస్తున్నారు.దీని కారణంగా పంతులు నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లిళ్లు జరగకుండా ముహూర్తం దాటిన తర్వాత పెళ్లిళ్లు జరుగుతున్నాయి.ఇలా ముహూర్తం తర్వాత పెళ్లిళ్లు జరిగితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.కనుక ఇకపై మాంగల్యధారణ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండటం అవసరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube