కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు , ఏ ఇండస్ట్రీ లో అయినా కంటెంట్ ఆకట్టుకునే విధంగా లేకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా బాక్స్ ఆఫీస్ వద్ద ఈమధ్య ఘోరంగా బోల్తా కొట్టేస్తున్నాయి.ఇంతకుముందు ఎంత పెద్ద ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా మొదటి వీకెండ్ వరకు మంచి వసూళ్లు వచ్చేవి స్టార్ హీరోలకు.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మొదటి రోజు టాక్ రాకపోతే రెండవ రోజు నుండి థియేటర్స్ మొత్తం బోసిపోతున్నాయి.రీసెంట్ గా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా( Bhola Shankar ) అందుకు ఉదాహరణ.
ఈ చిత్రం ఫుల్ రన్ లో కనీసం 30 కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేకపోయింది.కానీ ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ ( Bro the Avatar )మాత్రం డీసెంట్ స్థాయి రన్ ని సొంతం చేసుకుంది.

ఈ చిత్రానికి మొదటిరోజు ఎంత చెత్త టాక్ వచ్చిందో మనమంతా చూసాము.పెద్ద పెద్ద వెబ్స్ సైట్స్ అన్నీ 2 రేటింగ్స్ ఇచ్చాయి.టాక్ కూడా ఇది అసలు పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగ్గ సినిమా కాదు అంటూ అభిమానులే కామెంట్ చేసారు.మొదటి నుండి ఈ చిత్రానికి పెద్దగా హైప్ ఉండేది కాదు.
ఎందుకంటే విడుదలకు ముందు ఒక్కటంటే ఒక్క పాట కూడా క్లిక్ అవ్వలేదు, టీజర్ మరియు ట్రైలర్ కూడా యావరేజి అనిపించుకున్నాయి.కానీ ఓపెనింగ్స్ మాత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టింది.
అదే రేంజ్ ఫ్లో ని వీకెండ్ లో కూడా కొనసాగించింది.ట్రేడ్ మొత్తం షాక్, ఒక ఆఫ్ బీట్ సినిమాకి టాక్ లేకుండా ఈ స్థాయి వసూళ్లు రావడం ఏందీ అని అనుకున్నారు.
‘జైలర్’ చిత్రం( Jailer movie ) వచ్చే వరకు ‘బ్రో ది అవతార్’ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయి.

అలా ఫుల్ రన్ లో ఈ చిత్రానికి 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.ఫ్లాప్ టాక్ వచ్చిన ఒక ఆఫ్ బీట్ సినిమాకి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు.ఇదే సినిమా వేరే హీరో చేసి, ఇదే స్థాయి ఫ్లాప్ టాక్ వచ్చి ఉంటే ‘భోళా శంకర్’ కి పట్టిన గతి పట్టి ఉండేదని, పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల ఈ సినిమాకి 70 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
కాస్త మంచి డేట్, అలాగే భారీ రిలీజ్ ఇచ్చి ఉంటే ఈ చిత్రం 80 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లను సాధించి ఉండేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.