ఒక్కసారిగా ఇంటర్నెట్ కనెక్షన్ డౌన్ అయితే.. మీరు చేయాల్సింది ఇదే..!

ప్రస్తుతం చాలామంది ప్రజలు ఉదయం లేచిన సమయం నుంచి రాత్రి పడుకునే వరకు ఇంటర్నెట్‌పై బాగా ఆధారపడుతున్నారు.బంధుమిత్రులకు మెసేజ్ పంపించాలన్నా, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ జరపాలన్నా, ఆఫీస్ వర్క్‌కి చేసుకోవాలనుకున్నా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పనుల కోసం ఇంటర్నెట్‌ని ప్రజలు వాడుతున్నారు.

 If The Internet Connection Goes Down This Is What You Have To Do Internet, Connection, Shit Down, Technology Updates, Technology News,-TeluguStop.com

ఇంతలా ప్రజల జీవితాల్లో అంతర్భాగమైన ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా డౌన్ అయితే అన్ని పనులు ఒక్కసారిగా ఆగిపోతాయి కదా.దీనివల్ల రోజువారీ పనుల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

ఎవరైనా ఇతర ప్రదేశాలకు వెళ్లి గూగుల్ మ్యాప్స్ పై ఆధారపడి ముందుకు సాగుతున్నప్పుడు ఇంటర్నెట్ ఆగిపోతే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది.ఎవరైనా తమ బ్యాంక్స్‌లో తప్ప ఇంట్లో ఎలాంటి నగదు ఉంచుకోకపోతే.

 If The Internet Connection Goes Down This Is What You Have To Do Internet, Connection, Shit Down, Technology Updates, Technology News, -ఒక్కసారిగా ఇంటర్నెట్ కనెక్షన్ డౌన్ అయితే.. మీరు చేయాల్సింది ఇదే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

డబ్బు కోసం మళ్ళీ బ్యాంకుకి పరిగెత్తక తప్పదు.ఇంకా ఎలాంటివి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.

ఈ సమస్యలను ఎదుర్కోవాలి అంటే ముందుగా మీరు సిద్ధమై ఉండాలి.

ఏదైనా ప్రదేశంలో అల్లర్లు జరిగినప్పుడు లేదా ఇంకేదైనా కారణం వల్ల ఇంటర్నెట్ సడన్‌గా ఆగిపోయే అవకాశం ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మీరు ఇంట్లో అత్యవసర పరిస్థితులకు అవసరమైన క్యాష్ ఉంచుకోవాలి.అలాగే మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తున్న ప్రాంతానికి సంబంధించి గూగుల్ మ్యాప్స్‌ ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఈమెయిల్ లోని ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.ఇంటర్నెట్ లేకపోతే యాప్స్ ఓపెన్ కావు కాబట్టి ఏదైనా మూవీ, రెస్టారెంట్, వెహికల్ బుక్ చేసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ను ముందుగా స్క్రీన్‌షాట్ తీసుకోవాలి.

జర్నీ చేస్తున్నప్పుడు టైం పాస్ కోసం సినిమాలు చూడాలనుకునేవారు ముందుగానే వాటిని డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవాలి.బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఉన్నవారైతే అంతరాయం లేని ఇంటర్నెట్ వాడుకోవచ్చు.

తద్వారా చాలా పనులను పూర్తి చేసుకోవచ్చు.కానీ ఇతరులు మాత్రం తాము ప్రతి రోజు ఇంటర్నెట్ సాయంతోనే చేసే పనులను గుర్తించి ఇంటర్నెట్ లేనప్పుడు ఆ పనులు ఆగిపోకుండా జాగ్రత్తపడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube