జగన్ కోరిక కేంద్రం తీర్చితే ..? నష్టపోయేది వైసీపీనేగా ?

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో జగన్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.అందులో ఒకటి శాసన మండలి రద్దు.

 If The Center Dissolves The Legislature As Per Jagans Wish The Ycp Will Lose Tdp-TeluguStop.com

వైసీపీ సభ్యుల కంటే టిడిపి సభ్యులు శాసనమండలిలో ఎక్కువగా ఉండడం, వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు శాసనసభలో ఆమోదం పొందినా, మండలిలో అవి ఆమోదం పొందకపోవడం, టిడిపి వ్యూహాత్మకంగా అడ్డుకోవడం తదితర కారణాలతో కొంతకాలం పాటు విసుగు చెందిన వైసిపి అధినేత జగన్ చివరకు మండలి రద్దు చేస్తే టిడిపిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం తో పాటు, శాసనసభలో తాము అనుకున్నది అనుకున్నట్లుగా ఆమోదం పొందేలా చేసుకోవచ్చని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు మండలం రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి దానిని కేంద్రానికి పంపించారు.

ప్రస్తుతం కేంద్రం వద్ద ఆ నిర్ణయం పెండింగ్ లో ఉంది.అయితే టిడిపి బలం ఇప్పుడు శాసనమండలిలో తగ్గడం, వైసిపి బలం బాగా పెరగడంతో, వైసీపీని దెబ్బ కొట్టేందుకు టిడిపి వ్యూహాత్మక ఎత్తుగడ కి దిగింది.

టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఈ మేరకు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.శాసన మండలి రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం ఇంకా పరిశీలనలోనే ఉంది అంటూ కేంద్ర మంత్రి రిజుజు రాజ్యసభలో ప్రకటించారు.

అయితే ఈ బిల్లును కేంద్రం కనుక ఆమోదించి శాసన మండలి రద్దు చేస్తే ఇప్పుడు నష్టపోయేది వైసీపీనే.

Telugu Ap Cm, Central, Chandrababu, Counsil, Jagan, Tdpmp, Ysrcp, Ysrcp Mlas-Tel

అందుకే ఈ విషయంలో ఎక్కడా వైసీపీ నోరు మెదపడం లేదు.సైలెంట్ గా ఉంది.కానీ టీడీపీ మాత్రం జగన్ మొదట్లో డిమాండ్ చేసినట్లు గానే ఆ బిల్లును ఆమోదం పొందేలా చూసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.

జగన్ నిర్ణయం ఆయన పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టేలా చేస్తోంది అనేది టిడిపి ప్లాన్ గా కనిపిస్తోంది.శాసనమండలిని రద్దు చేయాలని ఇప్పుడు వైసిపి కోరడం లేదు.కానీ వైసిపిని ఇరుకున పెట్టేందుకు కేంద్రం శాసన మండలిని రద్దు చేస్తే టీడీపీపై పైచేయి సాధించినట్లే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube