గజినీలోని నటి చనిపోతే నయనతారకు చుక్కలు.. అసలు ఏం జరిగిందంటే?

ఎవరికైనా కొన్ని కొన్ని సార్లు పొరపాట్లు జరుగుతుంటాయి.ఆ పొరపాట్లు కాస్త కొన్ని ఘటనలకు కూడా దారి తీస్తుంటాయి.

 If The Actress Dies In Ghajini Movie Nayanthara Face So Many Problems What Actua-TeluguStop.com

దీంతో వాటిని సరిదిద్దుకోవడానికి చాలా మంది ఎంతో తాపత్రయ పడుతుంటారు.అలా పొరపాట్లు చాలా వరకు జరుగుతూనే ఉంటాయి.

ఇక సినీ ఇండస్ట్రీలో కూడా అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.అలా ఓసారి నయనతార కూడా ఓ పొరపాటు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.

ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ నయనతార.

రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి పేరు సంపాదించుకుంది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఈమె నటిగా కంటే వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

ఈమె 2003లో మలయాళం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇక 2006లో లక్ష్మి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత వరుసగా ఎన్నో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది.లేడి ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.

Telugu Actress, Gajini Actress, Ghajini, Nayantara, Tollywood-Movie

ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ కీలక పాత్రలో నటిస్తుంది.తమిళ భాషల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి సక్సెస్ లు అందుకుంది.ఇక ఇప్పటి వరకు నయనతార వ్యక్తిగతంగా చాలాసార్లు చాలా హాట్ టాపిక్ గా మారింది.ఇదిలా ఉంటే నయనతార గజిని సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ చనిపోతే నయనతార కు బాగా చుక్కలు కనిపించాయట.

Telugu Actress, Gajini Actress, Ghajini, Nayantara, Tollywood-Movie

గతంలో ముంబైలో హీరోయిన్ జియాఖాన్ ఓ అపార్ట్మెంట్ లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈమె బాలీవుడ్ లో గజిని సినిమాలో నటించింది.దీంతో ఈమె సూసైడ్ చేసుకున్న విషయాన్ని ముంబై మీడియా గజిని హీరోయిన్ చనిపోయింది అంటూ ప్రకటించారు.

ఇక ప్రేక్షకులందరూ గజిని హీరోయిన్ అనుకోగానే నయనతార అనుకొని వెంటనే తనకు బాగా ఫోన్లు చేశారట.

Telugu Actress, Gajini Actress, Ghajini, Nayantara, Tollywood-Movie

దీంతో నయనతార ఆ ఫోన్లు రిసీవ్ చేసుకోలేక బాగా ఇబ్బంది పడిందట.ఇక చివరికి తన ఫోన్ స్విచాఫ్ చేసిందట.అయినా కూడా మీడియాలో ఈ వార్త రావడంతో వెంటనే నయనతార స్పందించిందట.‘చనిపోయింది నేను కాదు.బాలీవుడ్ గజినీలో నటించిన జియా ఖాన్.

నేను బ్రతికే ఉన్నా’ అని చెప్పడానికి బాగా ప్రయత్నం చేసిందట.మొత్తానికి ఈ విషయంలో నయనతారకు బాగా చుక్కలు కనిపించాయని అర్థమవుతుంది.

ప్రస్తుతం నయనతార వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.తమిళంలో కాతు వాకుల రెండు కాదల్ సినిమాలో నటిస్తుంది.మలయాళం కూడా వరుస సినిమాలలో నటిస్తుంది.ఇక రజనీకాంత్ సరసన కూడా ఓ సినిమాలో నటిస్తుంది.

వీటితో పాటు పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుని ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube