ఆ బల్లి దొరికితే కోటీశ్వరులే.. అయితే క్రయవిక్రయాలు నిషేధం

బల్లిని చూడగానే చాలా మంది చిరాకు పడుతుంటారు.అది మీద పడితే వెంటనే పసుపు నీళ్లతో స్నానం చేస్తారు.

 If That Lizard Is Found, It Is The Billionaires. However Trading Is Prohibited L-TeluguStop.com

అపశకునంగా భావించి, ఆందోళన చెందుతుంటారు.అయితే ఓ బల్లి కోసం కొందరు చాలా అన్వేషణ కొనసాగిస్తున్నారు.

ఒక్క బల్లి దొరికినా కోటీశ్వరులు అవుతామని కలలు కంటున్నారు.అయితే నిజంగానే దానికి బ్లాక్ మార్కెట్‌లో మన దేశంలో రూ.80 లక్షల వరకు లభిస్తుంది.అదే విదేశాల్లో అయితే ఏకంగా కోట్ల రూపాయలు పలుకుతాయి.

దీనికి సంబంధించి క్రయవిక్రయాలపై నిషేధం విధించారు.అందుకే దీనిని పట్టుకున్న వారు ఎక్కడైనా అమ్మాలని చూసినా, కొనాలని చూసినా వారికి జైలు శిక్ష తప్పదు.

అయినా ఈ బల్లుల కోసం వేట ఆగడం లేదు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

భారతదేశం, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలలో గెక్కో లిజార్డ్ అనే బల్లి దొరుకుతుంది.ప్రపంచంలో మరెక్కడా ఇది దొరకదు.

అందుకే దీనికి అంత డిమాండ్.ఈ మూడు దేశాల మధ్య ఉన్న భౌగోళిక స్థానంతో కూడిన సిలిగురి ప్రాధాన్య వాణిజ్య కేంద్రంగా ఈ గెక్కో లిజార్డ్ బల్లి స్మగ్లింగ్ జరుగుతోందని నిఘా వర్గాలు గుర్తించాయి.11-20 అంగుళాల పొడవు, 300 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న ప్రతి గెక్కో బల్లి అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.కోటి పైనే పలుకుతోంది.

మరింత అధిక ధరను పొందడానికి ఎక్కువ బరువును చూపించడానికి, ఆ బల్లి కడుపులో పాదరసం ఇంజెక్ట్ చేస్తారు.దీంతో బల్లి బరువు కొంచెం పెరగుతుంది.

అయితే ఇంజెక్షన్ చేసిన కారణంగా రెండు రోజుల తర్వాత ఆ బల్లి చనిపోతుంది.ఈ బల్లికి అంత ధర పలకడానికి కారణం దానిని ఎయిడ్స్, కేన్సర్, నపుంసకత్వం, మధుమేహం ఔషధాల్లో దీనిని వినియోగిస్తుంటారు.

కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(వైల్డ్ లైఫ్) భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్-3లో అత్యంత ప్రమాదకరమైన జంతువుగా చేర్చబడినప్పటికీ, ఇది ఇంకా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్‌లో లేదు.అంతరించిపోతున్న జాతులలో ఇది కూడా ఉన్నందున దీని క్రయవిక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube