Tatkal Ticket Booking : తత్కాల్ టికెట్ ఇలా బుక్ చేస్తే వెంటనే అయిపోతుంది!

మనదేశంలో ప్రతిరోజూ అనేకమంది రైల్వేమార్గం గుండా పయనిస్తారు.మనదేశంలో రైల్వే ప్రయాణానికి వున్న డిమాండ్ మరేదేశంలో కూడా ఉండదంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే రైల్వే ప్రయాణం ఇక్కడ ఎలాంటి సాధారణ మానవుడైనా చేయగలడు.కారణం… ధరలు అందుబాటులోనే ఉండటం.ఇదే సమయంలో ఇక్కడ అర్జెంటుగా ఏదైనా వూరు వెళ్ళవలసి వచ్చినపుడు టిక్కెట్ తీసుకోవడం కూడా అంతే కష్టం.

 If Tatkal Ticket Is Booked Like This, It Will Be Sold Out Immediately,tatkal Ti-TeluguStop.com

ఎందుకంటే తత్కాల్ బుకింగ్ అనేది అంత తేలికైన విషయం కాదు.అయితే సౌకర్యవంతంగా మన టికెట్ రిజర్వేషన్ చేసుకొని ప్రయాణం చేయాలంటే తత్కాల్ తప్పనిసరి.

కానీ తత్కాల్ టికెట్ బుకింగ్ ఓపెన్ కాగానే వెంటనే బుక్ అవుతాయి టికెట్స్.ఇలాంటి సమయంలో అంత సులభంగా టికెట్లు దొరకడం కష్టతరం అవుతుంది.

అయితే ఇపుడు తత్కాల్లో కూడా వెంటనే టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం.సాధారణంగా IRCTC వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే వ్యక్తులకు ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి కదా.దానితోపాటు అవసరమైన అన్ని వివరాలు ఇక్కడ సమర్పించాల్సి ఉంటుంది.అయితే ఈ వివరాలన్నింటినీ నమోదు చేసే లోపే సీట్లు అన్ని ఫిల్ అయిపోతాయి.

Telugu Journey, Master List, Passengers, Railway Line, Railway, Railways, Tatkaa

ఇక రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మాస్టర్ లిస్ట్ ఫీచర్ సౌకర్యాన్ని అందిస్తుంది భారతీయ రైల్వే.ఇక్కడ కొన్ని వివరాలు ముందుగానే సేవ్‌ చేసుకోవచ్చు.ఈ విధంగా మీ వివరాలన్నింటినీ సేవ్ చేసిన తర్వాత తత్కాల్ బుకింగ్ చేసినప్పుడు టికెట్ చేయడం చాలా సులువు అవుతుంది.యాడ్ ప్యాసింజర్స్‌పై క్లిక్ చేయడం ద్వారా అన్ని వివరాలు జోడించబడతాయి.

ఈ ఫీచర్‌ను వాడాలంటే IRCTC వెబ్‌సైట్‌కి వెళ్లి, మై అకౌంట్‌ Myprofileని ఎంచుకున్నతరువాత జోడించు / సవరించు మాస్టర్ జాబితా ఆప్షన్‌ను ఎంచుకోండి.అనంతరం ప్రయాణీకుల వివరాలను సమర్పించాలి.

తద్వారా మీ బుకింగ్ సులభంగా చేయబడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube