పాలకూర, టమాట కలిపి వండితే విషంగా మారుతుందా..? అసలు విషయం చెప్పిన నిపుణులు  

If Spinach And Tomato Where Mixed-health,scientists,spinach,tomato,కలిపి వండితే విషంగా మారుతుందా

ఆకు కూరలు కంటికి చాలా మంచిది అని చెప్పిన వైధ్యులే పాల కూర మరియు టమాట తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పాటు అవుతాయి అంటూ చెబుతున్నారు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఈ విషయం దావానంలా వ్యాప్తి చెంది. దాంతో చాలా రుచిగా ఉండే పాలకూర మరియు టమాటల మిశ్రమం కూరను ఈమద్య కాలంలో అసలు వండటం మానేశాను..

పాలకూర, టమాట కలిపి వండితే విషంగా మారుతుందా..? అసలు విషయం చెప్పిన నిపుణులు-If Spinach And Tomato Where Mixed

ఇలాంటి కొన్ని మూడ నమ్మకాలను, చెడు ప్రచారాలను అరికట్టే బాధ్యత మన అందరిపై ఉంది. అందుకే ఈ విషయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.

అసలు పాలకూర మరియు టమాటలు కలిపి వండటం వల్ల ఎలాంటి చెడు ప్రభావం ఉండదు.

ఈ రెండింటి కాంబినేషన్‌లో మనం తింటే ఆరోగ్యంకు మంచే జరుగుతుంది కాని చెడు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో జరుగదు. కొందరు నమ్ముతున్నట్లుగా ఇలాంటి మిశ్రహ భోజనం చేస్తే కిడ్నీల్లో రాళ్లు వస్తాయి అనేది పూర్తిగా అవాస్తవం అంటూ నిపుణులు చెబుతున్నారు. అసలు ఏ డాక్టర్‌ కూడా పాలకూర, టమాట కలిపి తినకూడదు అని చెప్పడు అంటూ నిపుణులు చెబుతున్నారు.

అలా చెప్పినట్లయితే వారు నిజమైన డాక్టర్‌ కాదని మనం నిర్ధారణకు రావాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

కిడ్నీల్లో రాళ్లు ఈమద్య కాలంలో చాలా కామన్‌ అయ్యింది. అయితే కిడ్నీల్లో రాళ్లు ముఖ్యంగా మంచి నీరు ఎక్కువగా తాగక పోవడం వల్ల వస్తుంది. మొదట యూరిన్‌ ఇన్ఫెక్షన్‌ అయ్యి, ఆ తర్వాత దాని ద్వారా కిడ్నీల్లో రాళ్లు ఏర్పాటు అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇది పెద్ద సమస్య కాదు కాని, వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే బెటర్‌ అంటున్నారు. టమాటాలు ఎక్కువగా తిన్న వారికి కూడా కిడ్నీల్లో రాళ్లు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నిపుణులు అంటున్నారు. అందుకే ఈ విషయాన్ని నలుగురికి తెలిసేలా ప్రతి ఒక్కరు కూడా షేర్‌ చేయాలి..