రెండో సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై అయితే.. గెలుపు ఎవ‌రిదంటే...!

ప్ర‌పంచ‌క‌ప్ ఫైనల్లో న్యూజిలాండ్ – ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ టై అవ్వ‌డం,  ఆ త‌ర్వాత సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై అవ్వ‌డం.చివ‌ర‌కు బౌండ‌రీల కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్‌ను ప్ర‌పంచ విజేతగా నిర్ణ‌యించ‌డం.

 If Second Super Over Also Getting Tie,then Result Will Be Like This, Ipl, Newzel-TeluguStop.com

దీనిపై అనేక విమ‌ర్శ‌లు రావ‌డం జ‌రిగాయి.ఇక తాజాగా ఐపీఎల్లోనూ ఇప్పుడు సూప‌ర్ ఓవ‌ర్ అనేది మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

ఈ ఐపీఎల్లో ఇప్ప‌టికే నాలుగు మ్యాచ్‌లు సూప‌ర్ ఓవ‌ర్ వ‌ర‌కు వెళ్లాయి.అన్నింటికి భిన్నంగా ఆదివారం రెండు మ్యాచ్‌లు సూప‌ర్ ఓవ‌ర్‌కు వెళ్ల‌గా.

ఇందులో పంజాబ్ – ముంబై మ్యాచ్ ఏకంగా రెండో సూప‌ర్ ఓవ‌ర్ వ‌ర‌కు వెళ్లింది.

తొలి సూపర్‌ ఓవర్‌లో ఇరు జట్లు ఐదు పరుగులే చేయడంతో రెండో సూపర్ ఓవర్లో కింగ్స్‌ పంజాబ్‌ విజేతగా నిలిచింది.

ముందు బ్యాటింగ్ చేసిన ముంబై 11 ప‌రుగులు చేయ‌గా.ఆ త‌ర్వాత పంజాబ్ తొలుత ముంబై ఇండియన్స్‌ 11 పరుగులు చేస్తే దాన్ని కింగ్స్‌ పంజాబ్‌ ఛేదించింది.

క్రిస్‌ గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌లు 12 పరుగులు సాధించి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు.ఐపీఎల్ చ‌రిత్ర‌లో రెండు సూప‌ర్ ఓవ‌ర్ల ద్వారా మ్యాచ్ ఫ‌లితం రావ‌డం ఇదే తొలిసారి.

అయితే రెండో సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై అయితే మూడో సూప‌ర్ ఓవ‌ర్ ఆడిస్తారా ? అన్న సందేహాలు కొంద‌రికి ఉన్నాయి.

అయితే ఐపీఎల్లో మ‌ధ్యాహ్నం మ్యాచ్‌లు సూప‌ర్ ఓవ‌ర్‌కు వెళితే రాత్రి 8 గంట‌ల త‌ర్వాత మ్యాచ్ నిర్వ‌హించ‌కూడ‌దు.

అదే రాత్రి మ్యాచ్‌లు సూప‌ర్ ఓవ‌ర్‌కు వెళితే అర్ధ‌రాత్రి 12 గంట‌లు దాటాక మ్యాచ్ కొన‌సాగ‌కూడ‌ద‌ని ఐపీఎల్ ప్రారంభానికి ముందే నిబంధ‌న పెట్టుకున్నారు.రెండో సూపర్ ఓవర్‌ కూడా టై అయితే ఇరుజట్ల కెప్టెన్ల ఒప్పందం ప్రకారం చెరొక పాయింట్‌ కేటాయిస్తారు.

అప్పుడు మూడో సూప‌ర్ ఓవ‌ర్ ఉండ‌దు.ఇరు జ‌ట్లు చెరో పాయింట్ మాత్ర‌మే తీసుకోవాలి.

ఇలా కాకుండా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ నిబంధ‌న ప్ర‌కారం కాంట్ర‌వ‌ర్సీ  బౌండ‌రీ రూల్స్ అమ‌లు చేస్తే అప్పుడు ముంబై గెలిచి ఉండేది.ముంబై బౌండ‌రీలు ( ఫోర్లు, సిక్సులు) 24 కాగా, పంజాబ్ 22 మాత్ర‌మే కొట్టింది.

ఒక‌వేళ నాకౌట్ మ్యాచ్‌లో ఫ‌లితం తేలాల్సి ఉన్నందున అప్పుడు త‌ప్ప‌కుండా ఈ బౌండ‌రీ రూల్ అమ‌లు చేయాల‌ని ఐసీసీ నిబంధ‌న తెచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube