ప్రశ్నిస్తే బూతులు,దాడులు తర్వాత కేసులు

యాదాద్రి భువనగిరి జిల్లా:ఓ టీఆర్ఎస్ నాయకుడు సర్పంచ్ ని ప్రశ్నించినందుకుఅతని భార్యనుద్దేశించి అసభ్య మాటలతో సర్పంచ్ భర్త సోషల్ మీడియాలో స్టేటస్ గా పెట్టిన పోస్ట్వ లిగొండ మండలం కంచనపల్లి గ్రామంలో దుమారం రేపుతున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.బాధితుడు జాన్ రెడ్డి చెప్పిన కథనం ప్రకారం కంచనపల్లి గ్రామ సర్పంచ్ గా ఉన్న కొమిరెల్లి రమా భర్త బాలకృష్ణారెడ్డి (టీఆర్ఎస్)ని గతంలో జరిగిన గ్రామ సభలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ యూత్ కన్వీనర్ జాన్ రెడ్డి గ్రామాభివృద్ధిపై ప్రశ్నించాడు.

 If Questioned, The Cases Are After Fraud And Assault-TeluguStop.com

గ్రామంలో అనేక పనుల్లో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోందని వాటి వివరాలు వెల్లడించాలని కోరారు.దీన్ని మనసులో పెట్టుకున్న సర్పంచ్ భర్త షాడో సర్పంచ్ కొమిరెల్లి బాలకృష్ణారెడ్డి తన వాట్సాప్ స్టేటస్ గా “జాన్ నీ పెళ్ళాం…కాడ జరిగింది అవినీతి” అని జాన్ రెడ్డి భార్యనుద్దేశించి అసభ్య పోస్ట్ పెట్టుకున్నాడు.

అందరూ ఒకే పార్టీకి చెందిన వారు కావడంతో గ్రామ టీఆర్ఎస్ వాట్సాప్ గ్రూపులో అందరికీ తెలిసిపోయింది.సర్పంచ్ అధికార గర్వంతో, అత్యుత్సాహంతో పెట్టిన ఆ పోస్ట్ గ్రామంలో ఇతర వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది.

దీనిపై టీఆర్ఎస్ వాట్సాప్ గ్రూపులో చర్చ జరుగుతుండగా సర్పంచ్ భర్త జాన్ రెడ్డిని గ్రూపులో నుండి రిమూవ్ చేశాడు.దీనితో గ్రామ పంచాయతీ సమస్య కాస్త టీఆర్ఎస్ నాయకుల పంచాయితీగా మారింది.

దీన్ని అవమానంగా భావించిన జాన్ రెడ్డి సర్పంచ్ భర్తపై వలిగొండ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.అది సైబర్ నేరాల కిందకు వస్తుందని చెప్పి కోర్టు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు.

కోర్టు కేసు నమోదు చేయమని ఆదేశించడంతో సర్పంచ్ భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదిలా ఉంటే కొంతకాలం తర్వాత సదరు యూత్ లీడర్ జాన్ రెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నాడని సర్పంచ్ కొమిరెల్లి రమా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ విషయం కాస్త స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి దగ్గరకు వెళ్ళింది.ఎమ్మెల్యే ఇద్దరినీ రాజీ పెట్టాలని చూసినా కుదరకపోవడంతో పోలీసులు జాన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

కేవలం గ్రామ సమస్యలపై ప్రశ్నించినందుకు తనపై కక్షకట్టి సర్పంచ్ భర్త తన భార్య పట్ల అసభ్యంగా పోస్ట్ పెట్టడమే కాకుండా, తిరిగి తనపై అక్రమ కేసు బనాయించడం ఏమిటని గ్రామంలో యూత్ సభ్యులు సమావేశమై ఆదివారం వలిగొండ మండల కేంద్రంలో వందమందితో మూతులకు నల్ల రిబ్బన్ కట్టుకొని శాంతిర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ రాజేందర్ రెడ్డి మరియు జాన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే సర్పంచ్ భర్త దుర్మార్గంగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నించారు.

అతను పెట్టిన అక్రమ కేసును పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు నిగ్గుతేల్చాలని పోలీసులకు వినతిపత్రం సమర్పించామని చెప్పారు.టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకోవడంతో ఇప్పుడు ఈ అంశం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube