ప్రైవేట్ టీచర్లు 2 వేల కోసం ఇలా చేస్తే సరి..!

గడిచిన ఏడాది నుంచి కరోనా మహమ్మారి ప్రజలను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా ప్రైవేట్ టీచర్ల పాలిట  మోయలేని భారంగా నిలిచిందనే చెప్పాలి.

 If Private Teachers Do This For 2 Thousand-TeluguStop.com

కరోనా వైరస్ కారణంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలా మంది.ఈ ఆర్థిక సమస్యల కారణంగా కొంత మంది ప్రైవేటు టీచర్లు చిన్నచిన్న పనులు చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.

దీనితో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు స్కూలు తిరిగి ప్రారంభమయ్యే వరకు కూడా ప్రతి నెల రెండు వేల రూపాయల నగదు, 25  కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది.అయితే ప్రైవేటు టీచర్లు ఇందుకోసం దరఖాస్తులు చేసుకోవాలని,  అందుకు సంబందించిన  ముఖ్యమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.

 If Private Teachers Do This For 2 Thousand-ప్రైవేట్ టీచర్లు 2 వేల కోసం ఇలా చేస్తే సరి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రతి ప్రైవేట్ టీచర్ కు బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్ఈ కోడ్, ఆధార్ వివరాల తప్పనిసరి అని, అలాగే ఒకసారి దరఖాస్తు చేసిన అనంతరం ఎంఈవోలు, డీఈవోలు, తదితర అధికారులు దరఖాస్తులను  పరిశీలన నిర్వహించి అనంతరం కలెక్టర్ ద్వారా విద్యా శాఖకు  వివరాలను అందచేస్తారని  అధికారులు తెలియజేస్తున్నారు.వివరాల ఆధారంగా గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నుంచి అక్కడ పనిచేసే టీచర్ల వివరాలను ఆన్లైన్ ద్వారా అధికారులు సేకరించడం జరుగుతుంది.

ఇందు కొరకు  ఈ వివరాలను  స్కూల్ యాజమాన్యం వారు “schooledu.telangana.gov.in” వెబ్సైట్లో నమోదు చేయాలనీ  అధికారులు పేర్కొన్నారు.ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్ 15వ తేదీ వరకు కొనసాగుతుందని, 19వ తేదీ వరకు పరిశీలన ప్రక్రియ కొనసాగతుందని , ఆ తర్వాత 24వ తేదీ లోపు ప్రైవేట్ టీచర్ల ఖాతాలలో రెండు వేల రూపాయలు జమ అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు .అలాగే రేషన్ షాపుల వద్ద 25 కేజీల బియ్యాన్ని 21వ తేదీ నుంచి 25వ తేదీ లోపు అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది.

#Helpiing #2000rs #Ration Rice #Financial Aid #Teachers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు