ప‌వ‌న్ అంత ప‌ని చేస్తే ఏపీలో తిరుగుండ‌దా..?

If Pawan Does So Much Work Will He Turn Around In Ap

పవన్ కళ్యాణ్.మొన్నటి వరకు సినీ ఇండస్ట్రీకే పరిమితమైన ఈ పేరు ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఫేమస్ అయింది.జనసేన పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్.ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు పాలిటిక్స్‌లో ఓ వెలుగువెలగాలని ట్రై చేస్తున్నారు.ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తాను ఏమైనా చేస్తానని.తనకు ఎలాంటి భయం లేదని అనేక సార్లు చెప్పారు.

 If Pawan Does So Much Work Will He Turn Around In Ap-TeluguStop.com

ప్రస్తుతం పవన్ ముందు ఓ సవాల్ ఉంది అంటున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్.జనసేనకు బీజేపీ మిత్రపక్షం (పొత్తు పెట్టుకున్నారు).

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణను ఓ పాలసీగా మార్చుకుని చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నది.ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేస్తామంటుంది.

 If Pawan Does So Much Work Will He Turn Around In Ap-ప‌వ‌న్ అంత ప‌ని చేస్తే ఏపీలో తిరుగుండ‌దా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఆ ఫ్యాక్టరీ కార్మికులు 9 నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు.అయితే ఈ విషయంలో ఏపీ బీజేపీ నాయకులు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Ap News, Ap Politics, Bjp, If Pawan Does So Much Work, Pawan, Tdp-Telugu Political News

అసలు ప్రైవేటీకరణ ఉండదని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఒకానొక సందర్భంలో స్పష్టం చేశారు.కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం డిఫరెంట్‌గా ఉన్నాయి.ఈ టైంలో పవన్.విశాఖకు వస్తున్నారు.గతంలో పవన్ సెంట్రల్ మినిష్టర్ అమిత్ షాను కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని కోరినట్టు జనసేన కార్యకర్తలు చెబుతున్నారు.అయినా కేంద్రం ప్రైవేటీకరణ కోసం ముందుకు సాగుతున్నదే తప్ప.

పవన్ మాటలను చెవిన పెట్టినట్టు కనిపించడం లేదు.ఇదే టైంలో పవన్ విశాఖలో అరిస్తే అది కేంద్రానికి వినిపిస్తుందా? లేదా అన్న చర్చ సైతం కొనసాగుతోంది.కార్మికుల పక్షాన నిలబడాలని అనుకుంటే కేంద్రాన్ని పవన్ ప్రశ్నించక తప్పదు.ఒక వేళ అలాగే చేస్తే ఏపీలో పవన్ మైలేజ్ ఇంకా పెరిగే చాన్స్ ఉంది.కానీ కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది కేవలం పొలిటికల్ స్పీచ్ గానే పరిమితమవుతుంది.మొత్తానికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పవన్ వైఖరి ఎంటనేది ఈ పర్యటనతో స్పష్టమవుతుంది.

#AP #Pawan #Pawan #AP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube