కేన్సర్ బాధితుల కోసం ఈ చిన్నారి ఏం చేసిందో తెలిస్తే!

ప్రజెంట్ టైమ్స్‌లో ప్రతీ ఒక్కరు ఉరుకుల పరుగల జీవనంలో ఫుల్ బిజీ లైఫ్ గడుపుతున్నారు.తమ పనియే తమ ముఖ్యమనే భావనలోనే ఉంటున్నారు.

 If Only You Knew What This Kid Did For Cancer Victims-TeluguStop.com

ఈ క్రమంలోనే సొసైటీ గురించి, సామాజిక సేవ గురించి ఆలోచించే వారు తక్కువ మందే.ఒకవేళ ఆలోచించినా ఆచరణలో సాయం చేసే వారు అతి తక్కువ మందే.

కాగా, సేవ చేయడానికి వయసు, కులం, మతం అనేవి అడ్డంకులే కాదు.మంచి మనసుంటే చాలు సేవ చేయొచ్చు.

 If Only You Knew What This Kid Did For Cancer Victims-కేన్సర్ బాధితుల కోసం ఈ చిన్నారి ఏం చేసిందో తెలిస్తే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ చిన్నారి చేసింది చిన్న పనే అయినా ఆ పని ద్వారా సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చిందనే చెప్పొచ్చు.ఇంతకీ ఆమె ఏం చేసింది? అనే విషయం తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాలండోయ్.

కేన్సర్ రోగులకు జుట్టు ఊడిపోతుందన్న సంగతి అందరికీ తెలుసు.మరీ ముఖ్యంగా మహిళలయితే జుట్టు లేకపోవడం వల్ల చాలా బాధపడిపోతుండటం మనం చూడొచ్చు.ఈ నేపథ్యంలో కేన్సర్‌తో బాధపడుతున్న మహిళలకు సేవ చేయాలనే ఉద్దేశం పదహారు నెలల చిన్నారి చేసిన పని చూస్తే మీరు మెచ్చుకోకుండా ఉండలేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.చిన్నారి మంచి మనసును చూసి ప్రశంసింస్తారంతే.

కేన్సర్ పేషెంట్స్ కోసం హైదరాబాద్‏కు చెందిన కైర జువెంటస్ అనే అమ్మాయి తన కేశాలను దానం చేసింది.తద్వారా అతి చిన్న వయసులోనే హెయిర్ డోనర్‏గా నిలిచింది.

ఇలా దాతలు అందించిన కురులతో ప్రత్యేకంగా కేన్సర్ పేషెంట్స్ కోసం విగ్స్ తయారు చేస్తున్నాయి కొన్ని సంస్థలు.కాగా, ఇలా విగ్స్ అందిచడం ద్వారా వారిలో ఆత్మస్థైర్యం పెరిగే చాన్సెస్ ఉంటాయి.

కేన్సర్ బాధితులకూ జీవితంపైన ఆశలు పెరుగుతాయి.ఇలా చిన్నారి చేసిన పని గురించి తెలుసుకుని నెటిజన్లు ఆమెను సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు.

హైదరాబాద్ హెయిర్ డోనేషన్ ఫౌండేషన్‌కు చిన్నారి కైర తన కేశాలను డొనేట్ చేయగా, అవసరమైన కేన్సర్ పేషెంట్‌కు అవి వెళ్లడం ఆనందకరమని పేర్కొంది.అందించనున్నారు.

చిన్నారి తల్లిదండ్రలులు చిన్నారి చేసిన పనిని చూసి గర్వపడుతున్నారు.

#Kyra Juventus #Hyderabad #KnewKid #Cancer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు