గత రెండు మూడు సీజన్ల నుంచి ఇండియన్ టీం తమ సత్తా ని చాటలేక పోతుంది.ఇక అందులో భాగంగానే ఈ సీజన్ కి కెప్టెన్ గా రోహిత్ శర్మ( Rohit Sharma ) ను పక్కన పెట్టి హార్థిక్ పాండ్యను టీమ్ లోకి తీసుకున్నారు.
మరి ఈ నిర్ణయం తీసుకున్న ముంబై టీమ్ యాజమాన్యం చాలా వరకు తప్పు చేసిందని చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి దిగ్గజ కెప్టెన్ టీం లో ఉండగా హార్దిక్ పాండ్యను కెప్టెన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ చాలా మంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

ఇక అందులో భాగంగానే ముంబై( Mumbai Indians) టీం మీద చాలా వ్యతిరేకత అయితే వస్తుంది.అలాగే హార్థిక్ పాండ్యా( Hardik Pandya) బిహేవియర్ కూడా ఏమాత్రం బాలేదని ఆయన చేసే పనులు సక్రమంగా ఉండడం లేదని చాలామంది రోహిత్ శర్మ అభిమానులు కూడా తెలియజేస్తున్నారు.మొన్న ఆడిన మొదటి మ్యాచ్ లో రోహిత్ శర్మ ని ఫీల్డింగ్ విషయంలో హార్దిక్ అటు ఇటు తిప్పిన విషయం లో చాలా మంది రోహిత్ అభిమానులనే కాకుండా ప్రేక్షకులు కూడా చాలామంది హార్థిక్ పాండ్యా విషయంలో చాలా ఫైర్ అవుతున్నారు.ఇక ఇదిలా ఉంటే ఈరోజు హైదరాబాద్( Sunrisers Hyderabad )తో ఆడబోయే మ్యాచ్ లో తను తాను ప్రూవ్ చేసుకుంటే పర్లేదు .అలా కాకుండా హైదరాబాద్ కూడా ఓడిపోయినట్టైతే ముంబై టీం పరిస్థితి మరి దారుణంగా ఉండబోతుంది.ఇక దానికి తగ్గట్టుగానే హార్దిక్ పాండ్య కెప్టెన్సీ పైన కూడా వేటు పడే అవకాశాలైతే ఉన్నాయి.

కాబట్టి ఈ మ్యాచ్ ని ఎలాగైనా సరే గెలిపించాలని హార్థిక్ పాండ్య ప్రయత్నం చేస్తున్నాడు.ఇక రోహిత్ శర్మ అభిమానులు మాత్రం హార్థిక్ పాండ్య కెప్టెన్సీ చేస్తున్న ప్రతి మ్యాచ్ ఓడిపోవాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే దిగ్గజ కెప్టెన్ గా పేరు పొంది 5 సార్లు ముంబై కి కప్ అందించిన రోహిత్ శర్మని ఆ జట్టు యాజమాన్యం ట్రీట్ చేస్తున్న విధానం అస్సలు బాలేదని అభిప్రాయపడడం విశేషము…
.






