ఇకపై ఉద్యోగం పోతే ఈఎంఐల‌ను ఇన్సూరెన్స్ కంపెనీలే చెల్లిస్తాయా..?!

ఈ సంవత్సరం మొదటి నెల విజయవాడ నుంచి ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను పోగొట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే.అంతేకాదు కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు తెచ్చుకోవడం కూడా చాలా కష్టంగా మారిపోయింది.

 If Lose My Job Will The Insurance Companies Pay For The Emi  ,insurance, Claim,-TeluguStop.com

ఈ క్రమంలోనే ఉద్యోగులకు ఆర్థిక సమస్యలు రోజురోజుకు ఎక్కువైపోయాయి.దీంతో వారు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉద్యోగాలలో ఉన్నప్పుడు వారి అవసరాల కోసం బ్యాంకు నుండి క్రెడిట్ కార్డు తీసుకొని వాటి ద్వారా వస్తువు రూపంలో కొనుగోలు చేశారు చాలా మంది.ప్రస్తుతం కరుణ సమయంలో ఉద్యోగాలు పోవడంతో వారు ఆ తీసుకున్న క్రెడిట్ కార్డు బిల్లులను వాటికి సంబంధించిన ఈఎంఐల‌ను కట్టుకోవడానికి తెగ కష్టంగా మారిపోయింది.

అయితే ఈ పరిస్థితిని గమనించిన కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఉద్యోగులకు వారి ఉద్యోగ భద్రత కోసం ఇన్సూరెన్స్ ను కల్పించబోతున్నాయి.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

ఇన్సూరెన్స్ కంపెనీ లకు కాస్త ప్రీమియం చెల్లిస్తే చాలు.ఉద్యోగులు తమ ఉద్యోగాలకు భద్రత ఉండేలా ఇన్సూరెన్స్ ను పొందవచ్చు.ఒకవేళ అనుకోకుండా కంపెనీ వారు ఉద్యోగం నుంచి తొలగించిన, లేకపోతే సదరు పని చేసే కంపెనీ మూతబడిన సరే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉద్యోగం పై ఇన్సూరెన్స్ చేసిన వారికి మూడు నెలల వరకు వారి ఈఎంఐల‌ను ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది.ఇందుకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలు గరిష్టంగా 50 లక్షల లోన్ కలిగి ఉన్నట్లయితే అతనికి నెలకు 25 వేల చొప్పున మొత్తం మూడు నెలలకు కానీ 75 వేల రూపాయలను గరిష్టంగా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది.

ఇలా ఉద్యోగులు తీసుకునే కవరేజ్ అమౌంట్ బట్టి వారు ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితి.దీంతో 8000 నుండి 10000 రూపాయల మధ్యలో ప్రీమియం చెల్లించి ఉద్యోగానికి ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు.

అయితే కేవలం ఈ ఇన్సూరెన్స్ వారి ఉద్యోగానికి మాత్రమే కాకుండా.క్రిటికల్ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా కవర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.ఏదైనా అనుకోని ప్రమాదం సంఘటనలు జరిగినప్పుడు ఆసుపత్రిలో చేరితే కవరేజ్ బీమా వారికి లభిస్తుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ కొత్త తరహా ఇన్సూరెన్స్ లను ఎంతో మంది ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకువచ్చాయి.

కాకపోతే ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే కచ్చితంగా మీరు 3 నెలల ప్రీమియం చెల్లించిన తర్వాతనే వారి ఇన్సూరెన్స్ అందుబాటులోకి వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube