కేటీఆర్ సీఎం అయితే మరి కేసీఆర్ దృష్టి ఇక దాని మీదే?

పస్తుతం తెలంగాణలో ప్రజలలో, రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న అంశం మార్చి 18 న కేటీఆర్ పట్టాభిషేకం అనే వార్త.ఇక కేటీఆర్ రకరకాల బాధ్యతలు అప్పజెబుతూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్ ను సీఎం చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్త వినబడుతూ వస్తోంది.

 If Ktr Is The Cm, Then Kcr's Focus Is On You,  Kcr, Trs Party-TeluguStop.com

కాని ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ ధృవీకరించకున్నా, ఈ వార్తను ఖండించలేదు.మరి కేటీఆర్ ను సీఎం చేస్తే కేసీఆర్ దేనిపై దృష్టి పెడతారని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

ప్రచారంలో ఉన్న వార్తలను మనం పరిశీలిస్తే కేసీఆర్ ఇక పార్టీపై దృష్టి పెడతారని, జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు తగు ప్రణాళికలు సిద్దం చేసుకుంటారనే ప్రచారం సాగుతోంది.ఇప్పటికే ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని సైతం నిర్మిస్తుండడంతో ఈ నిర్ణయాన్ని ఎప్పటినుండో కేసీఆర్ అనుసరిస్తున్నవ్యూహం అని చెప్పుకోవచ్చు.

అంతేకాక ఇక కేటీఆర్ సీఎం అయ్యాక కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.ఆ నిర్ణయాలతో కేటీఆర్ ను ప్రజలు అంగీకరించేలా వ్యూహాన్ని రచించి ఇక కేటీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకవచ్చేలా కేసీఆర్ ప్రణాళికలు రచించే అవకాశం లేకపోలేదు.

చూద్దాం భవిష్యత్తులో ఏమి జరగనుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube