జగన్ చెప్పిన ఈ మాట నమ్మితే..నెక్స్ట్ సీఎం జగనే   If Jagan Take Serious Efforts On Special Status He’ll Be A Next CM     2018-01-24   01:27:17  IST  Bhanu C

జగన్ తాజాగా నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రత్యేక హోదా విషయంలో బీజేపి ఒకే చెప్తే మాకు బీజేపి కి మద్దతు ఇస్తాము అని ప్రకటించారు..అంతేకాదు కేంద్రంలో ఏ పార్టీ ప్రత్యేక హోదాకి మద్దతు ఇస్తుందో ఆపార్టీతో మేము కలిసి పనిచేస్తాం అని చెప్తూ మళ్లీ ప్రత్యేక హోదా విషయాన్ని తెరపై కి తీసుకుని వచ్చారు..అయితే ఈ విషయం టిడిపి కి గట్టి దెబ్బే అని చెప్పాలి..ఎందుకంటే పప్రత్యేక హోదా విషయంలో టిడిపి చేతులెత్తేసింది..అందుకే ప్రజలలో బాబు పై ఎన్నో విమర్శలు కూడా వినిపించాయి..ఈ సమయంలో జగన్ చెప్పిన మాట ఏపీ ప్రజలకి కరెక్ట్ గా కనెక్ట్ అయ్యిందనే చెప్పాలి..

అయితే జనం కనుకా జగన్ ని ఈ విషయంలో నమ్మితే మాత్రం టిడిపి కి పుట్టగతులు ఉండవని అంటున్నారు..ఎందుకంటే హోదా కోసం జగన్ బీజేపి తో పొత్తు పెట్టుకుంటున్నాడు తప్ప మరే విషయం లేదు కేవలం రాష్ట్రప్రయోజనాలకి మాత్రమే అనే మెసేజ్ వెళ్తుంది..అయితే టిడిపి విషయంలో ఇది పూర్తి విరుద్దంగా ఉంటుదని అంటున్నారు హోదా కోసం ఇద్దరి మధ్య భందాన్ని వదులు కోవచ్చు కదా అనే ప్రశ్న తలెత్తుతుంది ఇప్పుడు..అందుకే టిడిపి నాయకులకి జగన్ హోదా గురించి మాట్లాడిన ప్రతీ సారి భయం వేస్తుంది..

ఇదిలాఉంటే జగన్ ఇప్పుడు ఏపీలో ఎంతో బలమైన ప్రతిపక్ష నాయకుడు..చంద్రబాబు కి నిద్రలేకుండా చేస్తున్న ఏకైక వ్యక్తి అలాంటి జగన్ హోదా విషయంలో మాట్లాడే సరికి ఆంధ్రా హక్కుల సమితి నాయకులు, హోదా విషయంలో అప్పట్లో నిరాహాల దీక్షలు చేసిన ఎంతో మంది జగన్ కి మద్దతు తెలపడానికి సిద్దం గా ఉన్నామని అంటున్నారు..జగన్ ఈ విషయాన్నీ పరిశీలించి మరింతగా హోదా విషయంలో ముందుకు వెళ్తే జగన్ కి ఎదురుండదు అంటున్నారు విశ్లేషకులు..