మ‌నం రోజూ తినే అన్నంలో ఇది ఎక్కువ‌గా ఉంటే.. ఇక అంతేన‌ట‌

మనదేశంలో అయితే సాధారణంగా పేద, ధనిక వర్గం అనే తేడా లేకుండా అందరూ తినే ఆహార పదార్థాల్లో అన్నం అయితే తప్పక ఉంటుంది.వేరే దేశాల్లోనూ రైస్ ఉన్నప్పటికీ వారు వీటిని వేరే రూపంలోకి మార్చుకుని తింటారేమో తెలియదు.

 If It Is High In The Rice We Eat Every Day  Then So Be It, Rice, Orcenik-TeluguStop.com

కానీ, మన దేశంలో అయితే అన్నం వండుకుని తినే జీవనం కొనసాగిస్తుంటాం.అయితే, ఈ అన్నంలో ఆర్సెనిక్ అనే మూలకం ఎక్కువ మోతాదులో ఉంటే మనుషులకు ప్రమాదమేనట.

ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.బియ్యంలో ఉండే ఈ ఆర్సెనిక్ పదార్థంతో కేన్సర్ ముప్పు పొంచి ఉన్నదని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే, ఆర్సెనిక్ అనేది సహజంగా తయారయ్యే ఒక మూలకం మాత్రమే.అది మట్టి, వాటర్‌లోనూ ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

ఈ ఆర్సెనిక్ విషపూరితంగా మారి మనుషుల పాలిట శాపంగా మారుతుందని రీసెర్చర్స్ హెచ్చరిస్తున్నారు.యూరోపియన్ యూనియన్ ఈ ఆర్సెనిక్ మూలకాన్ని మొదటి కేటగిరీ కేన్సర్ కారకాల జాబితాలో చేర్చింది.

ఆర్సెనిక్ నేలలోకి క్రిమి సంహారక మందుల ద్వారా చేరుతుంది.ఓ కిలో మట్టిలో వంద ఎంజీ, లీటర్‌నీటిలో పది యూజీల ఆర్సెనిక్‌ ఉంటుందట.

అయితే, ఈ ఆర్సెనిక్‌ను క్రిమిసంహార‌క మందుల త‌యారీలోనూ వాడుతుంటారు.పంట‌ల‌కు పురుగుల మందులు చ‌ల్లిన‌ప్పుడు ఈ విష‌ర‌సాయనం భూమిలోకి వెళ్లిపోతుంది.ఇక భూమి నుంచి పండిన ధాన్యం ద్వారా అది ఆహార పదార్థంగా మారిపోతుంది.ఫలితంగా మనలోకి ఈ మూలకం ఎంటర్ అయిపోతుంది.

మొత్తంగా రోజురోజుకూ మట్టిలో ఆర్సెనిక్ శాతం పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బియ్యంలో ఉండే ఆర్సెనిక్ మూలకం స్థాయిని తగ్గించేందుకుగాను ప్రతీ రోజు అన్నం వండే ముందర అనగా ముందు రోజు రాత్రి అంతా బియ్యాన్ని నానపెట్టాలి.

శుభ్రమైన వాటర్‌‌తోనే బియ్యాన్ని కడగలి.ఇక అన్నం ఉడికే సమయంలోనూ నీళ్లను వార్చాలి.

ఇలా చేయడం ద్వారా రైస్‌లో ఉండే ఆర్సెనిక్ ఎలిమెంట్ పర్సంటేజ్ గణనీయంగా తగ్గే చాన్సెస్ ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.ఈ క్రమంలోనే పాలిష్ చేయని బియ్యాన్ని అనగా ముడి బియ్యాన్ని అస్సలు తినొద్దని, అలా తినడం ద్వారా ఆర్సెనిక్ మూలకం డైరెక్ట్‌గా హ్యూమన్ బాడీలోకి ఇంజెక్ట్ అవుతుందని, ఫలితంగా కేన్సర్ ముప్పు ఉంటుందని నిపుణులు, శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube