షూటింగ్ లేకపోతే బోర్ కొడుతుంది... ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది: కృతి శెట్టి

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి శెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయం అందు కోవడంతో ఈమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న కృతి శెట్టి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో నటించారు.

 If I Dont Shoot I Get Bored That Movie Changed My Life Kriti Shetty Kriti Shetty-TeluguStop.com

ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టికి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ సందర్భంగా యాంకర్ కృతి శెట్టిని ప్రశ్నిస్తూ మీరు కథల ఎంపిక విషయంలో ఎలా నిర్ణయాలు తీసుకుంటారు.

వచ్చిన కథలను చేసుకుంటూ వెళ్తారా లేకపోతే వడబోత వంటివి ఉంటాయా అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ సినిమా కథ వింటేనే ఎప్పుడెప్పుడు షూటింగ్ కు వెళ్లాలా అనిపించేలా ఉండే కథలను ఎంపిక చేసుకుంటాను.

నాకు ప్రతిరోజు షూటింగ్ కి వెళ్లాలనిపిస్తుంది.ఒకరోజు షూటింగ్ లేకపోయినా ఎంతో బోర్ కొడుతుంది అంటూ సమాధానం చెప్పారు.

Telugu Bebamma, Kriti Shetty, Swati, Tollywood, Uppena, Vaishnav Tej-Movie

ఇకపోతే ఉప్పెన సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా తన కెరియర్ లో ఎంతో ప్రత్యేకమని ఈ సినిమా తన జీవితాన్ని మార్చేసిందని తెలిపారు.ఆ సినిమా కారణంగానే నేను నేడు ఈ స్థాయిలో ఉన్నానని అందులో బేబమ్మ పాత్రను ప్రతి ఒక్క ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడటమే కాకుండా తనని ఆశీర్వదించారని కృతి శెట్టి ఈ సందర్భంగా ఉప్పెన సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక మాచర్ల నియోజకవర్గం సినిమాలో తాను స్వాతి అనే ఒక సాధారణ అమ్మాయి పాత్రలో కనిపిస్తానని తన పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube