కోడికి కోపం వ‌స్తే ఇలాగే ఉంటుందా.. ప‌రిగెత్తించి భ‌య‌పెట్టేసింది

ప్ర‌తి జీవికి ఓపిక కొంత వ‌ర‌కే ఉంటుంది.చిన్న ప్రాణి అయినా స‌రే దాన్ని ఎక్కువ‌గా విసిగిస్తే త‌న ప్ర‌తాపం ఏంటో చూపించేస్తుంది.

 If Hen Is Angry, Will It Be Like This  She Ran Away And Scared Him , Angry Hen,-TeluguStop.com

ప్రాణాల‌కు తెగించి మ‌రీ కొట్లాడుతుంది.ఇలా చిన్న జంతువ‌లు పెద్ద జంతువుల‌ను త‌రిమి కొట్టిన వీడియోలు ఇప్ప‌టికే మ‌నం అనేకం చూస్తున్నాం.

వీటికి నెట్టింట బాగానే ఆద‌ర‌ణ ద‌క్కుతోంది.ఇక‌పోతే ఇప్పుడు కోడికి సంబంధించిన వీడియో గురించి తెలుసుకుందాం.

కోడికి చెందిన వీడియోలు గ‌తంలో కూడా బాగానే వైర‌ల్ అయ్యాయి.వీటిల్లో ఎక్కువ‌గా కోడి త‌న పిల్ల‌లను కాపాడుకునేందుకు పోరాడినవే ఉన్నాయి.

గ‌ద్ద‌లు, లేదంటే పాములు, లేదా కుక్క లాంటివి త‌న పిల్ల‌ల జోలికి వ‌చ్చిన‌ప్పుడు త‌ల్లి కోడి ఎంత‌లా పోరాడుతుందో మ‌నం చూశాం.నిజానికి కోడి అలాంటి వాటి మీద గెల‌వ‌డం అనేది అసాధ్యం.

కానీ కోడి తెగించి కొట్లాడి ఇలాంటి జంతువుల‌ను ఎన్నోసార్లు త‌రిమి కొట్టిన‌ట్టు మ‌నం చూస్తున్నాం.ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తిని ఇలాగే ప‌రిగెత్తించింది.

అత‌ను ఏం చేశాడో తెలియ‌దు కోడికి విప‌రీత‌మైన కోపం వ‌చ్చేసింది.ఇంకేముంది అత‌న్ని ప‌రిగెత్తించి, ప‌రిగెత్తించి త‌రుముకొచ్చింది.

ఇక దాని బారి నుంచి త‌ప్పించుకునేందుకు అత‌ను వేగంగా పరుగులు తీస్తున్నాడు.

ఇలా కొద్ది దూరం అత‌ను ప‌రిగెత్తి చివ‌ర‌కు ఓ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు.

అయినా స‌రే ఆ కోడి మాత్రం అతన్ని విడిచిపెట్టలేదు.ఇంకింత వేగంతో వెంబడించి మ‌రీ చీల్చి చెండాడేసింది.ఇక అత‌ని బ‌ట్ట‌లు మొత్తం చిరిగిపోయినంత ప‌ని అయిపోయింది.చివ‌ర‌గా ఓ ఎత్తైన తడకను ఎక్కి త‌ప్పించుకుందామ‌ని చూసినా కుద‌ర‌క దానికి చిక్కిపోతాడు.ఇంకేముంది ఆ కోడి ప్ర‌తాపానికి దొరికిపోయాడు.దీన్నంతా కూడా అక్క‌డున్న వారు వీడియో తీసి నెట్టింట షేర్ చేశారు.

ఇంకేముంది దాన్ని చూసిన వారంతా ఏంట్రీ బ్రో ఇది ఎందుకు ఆ కోడికి కోపం తెప్పించావు అని ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube