ఒలంపిక్స్ లో ఆ పతకం గెలిస్తే రూ.6 కోట్లు..బంపరాఫర్ ప్రకటించిన ఆ సీఎం!

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే టోక్యో ఒలింపిక్స్ 2021 క్రీడా పోటీలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి.ప్రపంచ దేశాలన్నీ ఆ క్రీడల కోసం ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నాయి.

 If He Wins The Medal In The Olympics, He Will Get Rs 6 Crore, Tokyo Olympics, 20-TeluguStop.com

ఇదిలా ఉంటే భారత్ నుంచి కూడా చాలా మంది క్రీడాకారులు ఆ పోటీలల్లో పాల్గొంటున్నారు.ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన వారికి దేశంలోని రాష్ట్రాలు వరాల జల్లును ప్రకటించడానికి సిద్దమయ్యాయి.

అందులో భాగంగా టోక్యో ఒలింపిక్స్‌ 2021లో పోటీ చేసే క్రీడాకారుల‌కు ఆయా రాష్ట్రాలు న‌జ‌రానా ప్ర‌క‌టించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయతీ.అందులో భాగంగా ముందుగా త‌మిళ‌నాడు సర్కార్, ఒడిశా సర్కార్ ప్రోత్సహకాలను ప్రటించాయి.

తాజాగా ఆ జాబితాలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కూడా చేరింది.ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ గెలిచే విన్నర్లకు 6 కోట్ల రూపాయల న‌గ‌దును ఇస్తామని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య‌నాథ్ తెలియజేశాడు.

Telugu Bumper, Tokyo Olym, Uttarpradesh-Latest News - Telugu

టీమ్ ఈవెంట్ల‌లో స్వ‌ర్ణం గెలిచే క్రీడాకారుల‌కు 3 కోట్ల రూపాయలు ఇవ్వ‌నున్న‌ట్లు ఆయన ప్రకటించడ విశేషం.ఈనెల 23వ తేది నుంచి టోక్యోలో ఒలింపిక్స్ పోటీలు జరుగుతున్నాయి.టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేటటువంటి భార‌త క్రీడాకారులలో ప‌ది మంది క్రీడాకారులు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే చెందిన‌ వారే ఉండటంతో ఆ రాష్ట్ర సర్కార్ ఇటువంటి ప్రకటన చేసిందని మరికొందరు అంటున్నారు.షూటర్ సౌర‌భ్ చౌద‌రీ యూపీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

సింగిల్స్‌, టీమ్ ఈవెంట్ల‌లో పాల్గొంటున్న ప్ర‌తి క్రీడాకారుడికి 10 ల‌క్ష‌లు రూపాయలను ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు సీఎం యోగి ఆదిత్య‌నాథ్ తెలిపారు.ఈ ప్రకటన చేయకముందు యోగి వార‌ణాసిలో కాశీ విశ్వ‌నాథుడికి అభిషేకం చేసి దేశానికి మరిన్ని పతకాలు రావాలని కోరుకున్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో 2020లో జరగాల్సిన ఒలింపిక్స్‌ క్రీడా పోటీలు వాయిదాపడిన విషయం తెలిసిందే.అయితే ఈ ఏడాది ఆ ఆటలను నిర్వహిస్తూ వస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube