1994 లో అలీ హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ లో వచ్చిన “యమలీల” సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అప్పట్లో కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటిస్తూ విజయాలతో దూసుకుపోతున్న అలీని ఈ సినిమాలో హీరోగా ప్రకటిస్తూ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.ఈ సినిమాలో అలీ సరసన హీరోయిన్ గా ఇంద్రజ నటించి అందరిని మెప్పించారు.94 లో వచ్చిన ఈ సినిమా గురించి తాజాగా ఎస్ వి కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
నిజానికి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన యమలీల సినిమాలో హీరోయిన్ పాత్రలో ఇంద్రజ కన్నా ముందు సౌందర్యకి అవకాశం ఇచ్చారట.
కానీ అప్పటికే స్టార్ హీరోల సరసన సినిమాలలో నటిస్తున్న సౌందర్య అలీతో నటించడం వల్ల తన కెరీర్ దెబ్బతింటుందని ఆలోచనలో పడ్డారు.ఈ విషయం గురించి బాగా ఆలోచించి అలితో సినిమాలో నటించడానికి తను ఒప్పుకోలేదు.
ఒకవేళ మీరు హీరోగా నటించిన మీతో కలిసి సినిమా చేస్తానని సౌందర్య చెప్పారు.అప్పుడు సౌందర్యకు తన ఒకటే చెప్పానని అలీ కోసం ఈ సినిమాలో ఎవరినైనా మారుస్తాను కానీ ఆలిని మాత్రం మార్చను.
ఒకవేళ అలీ స్టార్ హీరో అయితే అప్పుడు తన పక్కన నటిస్తావా? అని ఎస్.వి.కృష్ణారెడ్డి అడగటంతో సౌందర్య ఎంతో షాక్ అయ్యారట.

తరువాత శుభలగ్నం సినిమాలో ఆలీతో స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ కోసం వెతుకుతున్న విషయం సౌందర్య తెలుసుకుని ఆ సినిమాలో అలీ పక్కన తాను నటిస్తానని స్వయంగా తానే ముందుకొచ్చారు.ఆరోజు ఎస్.వి.కృష్ణారెడ్డి గారితో జరిగిన సంభాషణ తర్వాత ఆలీతో సినిమా వదులుకోవడం ఏదో వెలితిగా ఉంది.మీకు అభ్యంతరం లేకపోతే ఆలీతో ఈ పాటలో తానే నటిస్తానని సౌందర్య బతిమిలాడరని ఆ ఇంటర్వ్యూ సందర్భంగా సౌందర్య గొప్పతనం గురించి ఎస్.వి.కృష్ణారెడ్డి తెలియజేశారు.