తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్రలో రాజకీయం మలుపు తిరుగుతుందా?

అవుననే అంటున్నారు తెలుగుదేశం వీరాభిమానులు.ఎందుకంటే గత ఎన్నికలలో వైయస్ జగన్ ( YS Jagan )గెలవడానికి దారి తీసిన అనేక కారణాలలో కెసిఆర్ పరోక్ష మద్దతు కూడా ఒకటని బలం గా ప్రచారం జరిగింది.

 If Congress Wins In Telangana, Will The Politics In Andhra Turn Around , Politic-TeluguStop.com

హైదరాబాద్ భూమిక గా వ్యాపారాలు నడుపుతున్న చాలామంది రాజకీయ నేతలను కేసీఆర్( KCR ) నయానొ భయానో జగన్ కు అనుకూలంగా పనిచేసేలా చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.ఓటుకు నోటు కేసులో తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిన చంద్రబాబుకు అది అప్పటి టిఆర్ఎస్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అంటూ ప్రచారం జరిగింది.

అయితే ఆ రిటర్న గిఫ్ట్ కు బదులు తీర్చే అవకాశం ఇప్పుడు టిడిపి కి వచ్చిందని, అందుకే కాంగ్రెస్( Congress ) గెలుపు కోసం తెలుగుదేశం తెలంగాణ ఎన్నికల నుంచి వాకౌట్ చేసిందని, తమ అనుకూల ఓటు బ్యాంకుతోపాటు తెలంగాణలో పెద్ద ఎత్తున సెటిల్ అయిన సీమాంధ్రుల ఓట్లను కూడా కాంగ్రెస్ కు మళ్ళించేలా తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి .

Telugu Congress, Telangana, Ys Jagan-Telugu Political News

కేసీఆర్ ఓడిపోతే జగన్ బలం తగ్గుతుందని, అది వచ్చే ఎన్నికలలో తమ గెలుపుకు బాటలు వేస్తుందని తెలుగుదేశం అభిమానులు నమ్ముతున్నట్లుగా కనిపిస్తుంది .అందుకే ఈసారి కేసీఆర్ కు బారి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారట .గత ఎన్నికలలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగు దేశాన్ని భూచి గా చూపి బారాస రాజకీయంగా లబ్ధి పొందింది.దాంతో ఈసారి బారాసకు అటువంటి అవకాశం ఇవ్వకూడదు అన్నట్లుగా టిడిపి జాగ్రత్త పడింది.అంతే కాకుండా తాము ప్రత్యక్షంగా పోటీ పడకపోయినా కాంగ్రెస్ గెలుపుకి అవకాశమున్న అన్ని రకాల సహాయాలు చేయాలని ఒక వేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తమ పాత పరిచయాలతో వచ్చే ఎన్నికలకు అవసరమైన సహాయ సహకారాలను పొంద వచ్చన్న ఆలోచనలో తెలుగుదేశం అధిష్టానం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి .మరి తెలుగుదేశం అభిమానులు ఆశలు చిగురిస్తాయో లేదో చూడాలి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube