బాబు ఫీల్డ్‌లో దిగితే… ఆ శాతం పెరుగుతుందేమో… !  

if chandrabbau enter to the field, the voter percentage will increase, andhra pradesh, chief minister jagan mohan reddy, TDP, ysrcp, vote bank, chandrababu stratagey - Telugu Andhra Pradesh, Chandrababu Stratagey, Chief Minister, If Chandrabbau Enter To The Field, Jagan Mohan Reddy, Tdp, The Voter Percentage Will Increase, Vote Bank, Ysrcp

ఏపీలో ఎన్నికలై 17 నెలలు అవుతుంది.అధికారంలో ఉన్న జగన్ అద్భుత పథకాలు, కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకెళుతున్నారు.

TeluguStop.com - If Chandrabbau Enter To The Field The Voter Percentage Will Increase

అటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు సైతం, జగన్ ప్రభుత్వం మీద నిత్యం పోరాటం చేస్తున్నారు.ప్రభుత్వం తప్పులని, అక్రమాలని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే బాబు ఎంత కష్టపడిన ఈ 17 నెలల కాలంలో వైసీపీ బలం తగ్గించలేకపోయారని ఇటీవల వి‌డి‌పి అనే సర్వే సంస్థ ద్వారా తెలిసింది.అలాగే జగన్ కూడా టీడీపీ ఓటు బ్యాంక్‌ని కదపలేకపోవడం గమనార్హం.

TeluguStop.com - బాబు ఫీల్డ్‌లో దిగితే… ఆ శాతం పెరుగుతుందేమో… -Political-Telugu Tollywood Photo Image

2019 ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం ఓట్లు రాగా, టీడీపీకి 39 శాతం ఓట్లు పడ్డాయి.ఇక తాజాగా వి‌డి‌పి సంస్థ నిర్వహించిన సర్వేలో వైసీపీ, టీడీపీలకు ఓట్ల శాతం పెరగడం విశేషం.ఇప్పుడు వైసీపీకి 52.97 శాతం ఓట్లు రాగా, టీడీపీకి 40.06 శాతం ఓట్లు వచ్చాయి.అంటే రెండు పార్టీలకు ఓట్లు పెరిగాయి.

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రజల మద్ధతు ఉంటుంది.పైగా జగన్ అద్భుత పథకాలు ఇస్తున్నారనే ప్రచారం ఉంది.

ఇలాంటి తరుణంలో టీడీపీ ఓటు బ్యాంక్ తగ్గాలి.కానీ టీడీపీ ఓట్ల శాతం తగ్గకపోగా, కాస్త పెరిగింది.అంటే ప్రజలు ఇంకా టీడీపీ పక్షాన ఉన్నారు.

ఇదే సమయంలో చంద్రబాబు కాస్త దృష్టి పెడితే ఓట్ల శాతం మరింత పెరిగే అవకాశం లేకపోలేదని విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు.

చంద్రబాబు ప్రజల మధ్య ఉంటే పరిస్తితి వేరుగా ఉంటుందని అంటున్నారు.కరోనా ఎంటర్ అయిన దగ్గర నుంచి బాబు హైదరాబాద్‌కే పరిమితమైన విషయం తెలిసిందే.ఇప్పటికీ ఆయన ఇంటి దగ్గర నుంచే రాజకీయం నడుపుతున్నారు.అలా కాకుండా ప్రజల మధ్యలో ఉంటూ, సమస్యల మీద పోరాటం చేస్తే ఫలితం వేరేగా ఉంటుందని చెబుతున్నారు.

ఇప్పటికైనా బాబు ఫీల్డ్‌లో దిగితే ఓట్ల శాతం పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు

.

#Ysrcp #TheVoter #IfChandrabbau #Vote Bank #Andhra Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

If Chandrabbau Enter To The Field The Voter Percentage Will Increase Related Telugu News,Photos/Pics,Images..