బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణా సీఎం ఆయనేనట!

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి సంబందించిన ఆడియో ఒకటి ఇప్పుదు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఇటీవల ఎంపీ గరికపాటి పార్టీ ఎందుకు మారారు అని అంటూ ఒక అభిమాని ఫోన్ కాల్ లో ప్రశ్నిస్తే సమాధానము చెప్పిన విషయం తెలిసిందే.

 If Bjp Will Comes Into Power In Telangan Than Rajagopal Will Be The Cm 1-TeluguStop.com

అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ లోకి జంప్ చేసిన రాజగోపాల్ రెడ్డి చేసినట్లు ఒక ఆడియో విడుదల అయ్యింది.ఆ కాల్ లో పార్టీ మారుతున్నారా అని ఒక అభిమాని ప్రశ్నిస్తే, అవును త్వరలో అంటూ సమాధానం ఇచ్చారు.

అయితే ఒకవేళ తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ సీఎం తానే నంటూ ఆ అభిమాని కి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు ఆ ఆడియో లో ఉంది.ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఆడియో వైరల్ అవుతున్న సంగతి పక్కన పెడితే బీజేపీ తెలంగాణా అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రాజగోపాల్ కు కౌంటర్ ఇచ్చారు.ఒకవేళ పదవులకు,పొజీషన్ కు ఆశపడి పార్టీ మారితే మాత్రం ఖచ్చితంగా వారికీ నిరాశ తప్పదని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు నిబద్దమైన పార్టీ అని,కుటుంబ పార్టీ కాదని, సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఒక ఆడియో కు స్పందనగా ఈ విషయాన్నీ వెల్లడించినట్లు ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube