ఆ గ్రామంలో కరెంటు కోతకి కారణం ఎవరో తెలిస్తే నవ్వి పోతారు..!

ప్రేమ ఎంతో గొప్పది.ప్రేమించిన వ్యక్తి కోసం ఎటువంటి సాహసం చేయడానికి అయినా వెనుకాడరు.

 If Anyone Knows The Reason For The Power Cut In That Village They Will Smile-TeluguStop.com

ప్రేమ గుడ్డిది అంటారు కదా.అందుకనే ఒక వ్యక్తి తన ప్రియురాలని కలుసుకోవడానికి ఆ ఊర్లో ఉన్న అందరిని గుడ్డివాళ్ళని చేసేసాడు.తన ప్రేయసిని రహస్యంగా కలుసుకోవడానికి ఆమె ఇంటి పవర్ కట్ చేయడంతో పాటు ఊళ్ళో వాళ్ళ అందరి ఇళ్లలోని పవర్ కట్ చేసాడు.ప్రియురాలిని కలవడానికి రహస్యంగా గోడలు దూకి వెళ్లి కలిసిన ప్రేమికుల గురించి మీరు వినే ఉంటారు.

కానీ ఇతను కాస్త కొత్తగా అలోచించి ఊళ్ళో ఉన్న అందరి ఇళ్లలోని కరెంట్ కట్ చేసాడు.ప్రతిరోజు సాయంత్రం ఇదే తంతు.అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా.? ఎలాగంటే మనోడు పని చేసేది ఈ విద్యుత్ శాఖలో కాబట్టి.తన ప్రియురాలిని కలవాలని ఆమె ఇంటికి వెళ్లేందుకు ప్రతిరోజూ చీకటి పడే సమయానికి ఊరి మొత్తానికి పవర్ కట్ చేసేవాడు.

 If Anyone Knows The Reason For The Power Cut In That Village They Will Smile-ఆ గ్రామంలో కరెంటు కోతకి కారణం ఎవరో తెలిస్తే నవ్వి పోతారు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆమెను కలిసి వెళ్లాక మళ్లీ ఆ ఊరికి కరెంట్ వచ్చేది.

అసలు ప్రతిరోజు ఇలా ఎందుకు మన ఊరిలోనే కరెంట్ పోతుంది.పక్క గ్రామాల్లో పవర్ పోవడం లేదని గ్రామస్థులకు అనుమానం వచ్చింది.

అలా ఒకరోజు సరిగ్గా ఆ వ్యక్తి పవర్ కట్ చేసే సమయానికి ఆ ఊరి యువకులు అతనిని రెడ్ హ్యాండెడ్‌ గా పట్టుకుని దేహశుద్ధి చేశారు.గుండు కొట్టించి అర్ధనగ్నంగా ఊరంతా ఊరేగించారు.

ఈ ఘటన బీహార్‌ లోని పూర్ణియా జిల్లాలోని గణేష్‌పూర్ అనే గ్రామంలో జరిగింది.సాయంత్రం రోజూ ఒకే సమయంలో గ్రామంలో కరెంట్ పోయేదని, రెండు నుంచి మూడు గంటలుగ్రామంలో కరెంట్ పోయేదని ఆ గ్రామంలోని కొందరు చెప్పారు.

కొన్ని రోజులకు నిఘా పెట్టగా తమ గ్రామంలో విద్యుత్ శాఖ ఉద్యోగిగా పోస్టింగ్ తీసుకున్న వ్యక్తే ఈ పని చేస్తున్నట్లు తెలిసింది.అదే గ్రామానికి చెందిన ఓ వితంతు మహిళ భర్త చనిపోయి ఇంట్లో ఒంటరిగా ఉంటోందని, ఆమెను కలిసేందుకు ఇతను ఇలా ఊరంతా కరెంట్ తీస్తున్నట్లు తెలిసింది.కరెంట్ తీసేశాక ఆ ఇద్దరూ కలిసి ఆ మహిళ ఇంటికి దగ్గర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కలుసుకునేవారని.అలా కలిసిన సమయంలో ఇద్దరినీ రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నామని గ్రామస్తులు చెప్పారు.

అతనికి దేహశుద్ధి చేసి గుండు గీసి ఊరంతా ఊరేగించి మహిళతో గ్రామ సర్పంచ్ సమక్షంలో పెళ్లి చేసినట్లు గ్రామస్తుడైన రామ్ ముర్మూ చెప్పారు.

#Lovers #Supply

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube