చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు అన్నీ ఫెయిల్ అయిన‌ట్టేనా..

అర్జెంటుగా ఏదో ఒక‌టి చేసేసి జ‌నాల్లో మ‌ళ్లీ ఆద‌ర‌ణ పెంచేసుకోవాల‌ని చంద్ర‌బాబు నాయుడు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.ఇందులో భాగంగా ఏ చిన్న అవ‌కాశం దొరికినా స‌రే దాన్ని వాడేసుకుంటున్నారు.

 If All Chandrababu's Attempts Fail  Chandrababu, Bjp,ap News,ap Politics-TeluguStop.com

ఎంలాగైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టేసి త‌న మార్క్ మాయాజాలాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని చూస్తున్నారు.ఈ త‌రుణంలోనే ఆయ‌న‌కు మొన్న ఓ అంశం క‌లిసివ‌చ్చింది.

ఆయ‌న పార్టీ నేత అయిన ప‌ట్టాభిరామ్ చేసిన వ్యాఖ్య‌లకు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయి టీడీపీ ఆఫీసుల మీద దాడులు చేసిన విష‌యం విదిత‌మే.

కాగా దీన్ని అవ‌కాశంగా మ‌లుచుకున్న చంద్రబాబు నాయుడు నేరుగా ఢిల్లీ వెళ్లి రాష్ట్ర‌ప‌తిని క‌లిశారు.

ఆర్టికల్ 356ను అమలు చేసి ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టేయాలంటూ రిక్వెస్ట్ చేశారు.అయితే ఇక్క‌డే ఆయ‌న వెళ్లిన టూర్ కాస్తా ప్లాప్ అయింద‌నే టాక్ వినిపిస్తోంది.

ఎందుకంటే ఢిల్లీలో ఏది చేయాల‌న్నా ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే హోం మినిస్ట‌ర్ అమిత్ షాలు మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు.ఇంకెవ‌రినీ క‌లిసినా పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌ద‌న్న విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

కానీ బ్యాడ్‌ల‌క్ ఏంటంటే చంద్ర‌బాబుకు మాత్రం వారి అపాయింట్‌మెంట్ ద‌క్క‌లేదు.

Telugu Amith Shah, Ap, Chandrababu, Narendra Modi, Ysrcp-Telugu Political News

వారి అపాయింట్‌మెంట్ కోసం చంద్ర‌బాబు రెండు రోజులుగా ప్ర‌య‌త్నించినా వారు మాత్రం ఆయ‌న్ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదు.ఇక చేసేది లేక చంద్రబాబు అండ్ కో వెనుదిరిగిపోయారు.అంటే మొత్తంగా ఎటు చూసినా చంద్ర‌బాబు ప్లాన్ మాత్రం ఫెయిల్ అయింద‌నే చెప్పాలి.

రాష్ట్ర‌ప‌తిని క‌లిసినంత మాత్రాన మోడీ, షాల అనుగ్ర‌హం లేకుండా ఏమీ జ‌ర‌గ‌ద‌న్న విష‌యం చంద్ర‌బాబుకు కూడా విదిత‌మే.కానీ రెండున్న‌రేండ్లుగా చంద్ర‌బాబు ఎంత ప్ర‌య‌త్నించినా వారుమాత్రం ఆయ‌న్ను అనుగ్ర‌హించ‌ట్లేదు.

ఇలా చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా చేసిన ప్ర‌చారం ఆయ‌న‌కు ఇప్పుడు శాపంగా మారింది.మ‌రి రాబోయే కాలంలో అయినా ఫ‌లిస్తుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube