అయ్యో... మన ఇడ్లి మనది కాదట  

Idly Does Not Born In Our Country-800,born,famous,food,general Telugu Updates,idly,india,indonesia,research,tamil Nadu,years

సౌత్ ఇండియా వారికి టిఫిన్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ఇడ్లి. ముఖ్యంగా తమిళనాడు ఇడ్లికి చాలా ఫేమస్. ఇన్నాళ్లుగా ఇడ్లి అనేది ఇండియాలోనే పుట్టిందని, అది కూడా సౌత్ ఇండియాలో పుట్టిందని అంతా గొప్పగా చెప్పుకున్నాం...

అయ్యో... మన ఇడ్లి మనది కాదట-Idly Does Not Born In Our Country

కానీ తాజాగా ఇడ్లి అనేది ఇండియాలో పుట్టలేదని నిపుణులు అంటున్నారు. వారు చెబుటున్న మాటలు వింటూ ఉంటే వారు చెప్పేది నిజమేనేమో అనే అభిప్రాయం కూడా కలుగుతోంది.

ఎన్నో ఫుడ్స్ పై ప్రయోగాలు చేసి, వాటి పుట్టు పూర్వోత్తరాలు కనిపెట్టిన వ్యక్తి కెటి ఆచార్య.

ఈయన ఇడ్లి గురించి చాలా కాలంగా ప్రయోగాలు, పరిశోధనలు. చేశాడట. చివరకు ఆయనకు తెలిసిన విషయం ఏంటి అంటే ఇడ్లి అనేది ఇండియాకు వచ్చింది కానీ, ఇక్కడే పుట్టలేదు.

అయితే ఇడ్లి ఇండియాకు వచ్చిన తర్వాత చాలా మార్పులకు గురి అయ్యిందని అంటున్నాడు ఇండోనేషియా దేశంలో ఇడ్లి పుట్టింది.

అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఆయనకు లభించాయి. అయితే ప్రస్తుతం మాత్రం ఇడ్లికి ఇండోనేషియా కంటే కూడా అధికంగా ఇండియా వారు తింటున్నారు. 800 నుండి 1200 సంవత్సరాల మధ్యలో ఇడ్లి అనేది ఇండియాలో ప్రవేశ పెట్టి ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఇడ్లికి ఇండోనేషియా వారు పేటెంట్ తీసుకునే అవకాశం కూడా ఉందని ఆయన చెబుతున్నాడు.

మొత్తానికి మనది మనది అనుకున్న ఇడ్లి ఇప్పుడే వేరే వారిది అంటే బాదగానే అనిపిస్తుంది.