“అమ్మా .రోజు ఈ ఇడ్లీ ఏంటి ? చప్పగా ఎలా తింటారు దీన్ని”, ఇంట్లో తల్లిని ఓ పిల్లాడు అడుగుతుంటాడు.” ఇడ్లియా .పేషెంట్ లు తింటారు అది” .కాస్త పాష్ గా ఉండే అమ్మాయి తిరస్కరిస్తూ ఉంటుంది.” హోటల్ దాకా వచ్చి ఇడ్లీ తింటానంటావేంట్రా ” ఒక స్నేహితుడితో మరో స్నేహితుడు.
దక్షిణాదిలో సాంప్రదయ బ్రేక్ఫాస్ట్ అయినా, ఎందుకో మన కంటికి ఇడ్లీ చులకన.కాని పొద్దున్నే ఇడ్లిని మించిన టిఫిన్ లేదంటున్నారు డాక్టర్లు.ఎందుకంటే?
* ఇడ్లీ ఆవిరి పద్ధతిలో తయారవుతుంది.ఆరోగ్యానికి చేటు చేయని పద్ధతి ఇది.
* నూనే వాడకపోవడంతో ఇది శరీరంలో ఎలాంటి కొవ్వుని జమచేయదు.
* జీర్ణించుకోవటం చాలా సులువు.
* కాలరీలు తక్కువ.లావుగా ఉన్నవారికి సరైన అహారమిది ఉదయం పూట.
* నాలుగు ఇడ్లీలు తీంటే, 33 మిల్లి గ్రాముల కాల్షియమ్, 31 మిల్లి గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.5 మిల్లి గ్రాముల కొవ్వు, 16 మిల్లి గ్రాముల ఐరన్, 14 మిల్లి గ్రాముల విటమిన్ బ3, 0.08 మిల్లి గ్రాముల విటమిన్ బి2, 0.14 మిల్లి గ్రాముల విటమిన్ బి1, 0.05 మిల్లి గ్రాముల విటమిన్ A, 6.7 గ్రాముల ప్రొటిన్స్, 157 కాలరీలు అందుతాయి మన శరీరానికి.
లాభలైతే తెలుసుకున్నారు.ఇక పొద్దునే ఏం టిఫిన్ చేయాలనేది మీ నిర్ణయం.