ఇడియట్ సినిమాలో రవి తేజ చెల్లి గుర్తుందా..? ఇప్పడేలా ఉందో తెలుసా..?

తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “ఇడియట్” చిత్రం సినీ ప్రేక్షకులకి ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ మరియు హీరోయిన్ రక్షిత నటించగా ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, గిరిబాబు, శ్రీనివాస్ రెడ్డి, అలీ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

 Idiot Movie Fame Ravi Teja Sister Vidyavathi Real Life And Movie Career Life News-TeluguStop.com

అయితే ఈ చిత్రంలో  హీరోయిన్ రవితేజ చెల్లెలి పాత్రలో నటించిన నటి విద్యావతి గురించి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

అయితే విద్యావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగింది.

 Idiot Movie Fame Ravi Teja Sister Vidyavathi Real Life And Movie Career Life News-ఇడియట్ సినిమాలో రవి తేజ చెల్లి గుర్తుందా.. ఇప్పడేలా ఉందో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ అమ్మడి తల్లిదండ్రులు ఆర్మీ విభాగంలో పని చేసేవారు.కాగా చిన్నప్పటినుంచి విద్యావతి కి సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఎక్కువగా ఉండేది.

దీంతో అప్పుడప్పుడు తన పాఠశాలలో చదువుతున్న సమయంలో ఎక్కువగా కల్చరల్ యాక్టివిటీస్ లో బాగా పాల్గొనేది.ఈ క్రమంలో తెలిసిన వారి ద్వారా ఇడియట్ చిత్రంలో హీరో చెల్లెలి పాత్ర కోసం ఆడిషన్స్ కి వెళ్లి సెలెక్ట్ అయింది.

ఆ తర్వాత మళ్లీ రవితేజ హీరోగా నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రంలో కూడా రవితేజ చెల్లెలి పాత్రలో నటించింది.అయితే కెరీర్ పరంగా సినిమా అవకాశాలు బాగానే బాగానే వస్తున్న సమయంలో చదువుపై దృష్టి సారించి కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

ఆ తరువాత చదువులను పూర్తిచేసి “మా సిరి మల్లి” అనే చిత్రం ద్వారా మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.కానీ ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోయింది.దీనికి తోడు ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన ఫోర్, ఎస్.పీ శంకర్, సిగ్నల్, తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.దీంతో ఈ ప్రభావం ఈ అమ్మడి సినిమా కెరియర్ పై పడింది.కాగా చివరగా కరణం, మే మై, అనే రెండు తమిళ చిత్రాలలో 2017 వ సంవత్సరంలో కనిపించింది.

కానీ ఈ చిత్రాలు కూడా ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలని తెచ్చిపెట్టే లేకపోయాయి దీంతో ప్రస్తుతం విద్యావతి సినిమా అవకాశాలు లేక ఇంటి పట్టునే ఖాళీగా గడుపుతోంది.

#VidyavathiReal #Vidyavathi #Idiot #Ravi Teja #IdiotMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు