అమెరికాలో భారతీయ విద్యార్ధిల హవా పెరుగుతోంది..!  

Idian Nri Students Proving Their Talent In America-

అమెరికాలో భారతీయ విద్యార్ధిల హవా పెరుగుతోందిగత రెండేళ్ళ క్రితం మొదటి సారి 2 లక్షలకి వారి స్థాయి ఉందా తాజాగా ఇప్పుడు గణాంకాల ప్రకారం 2.27 లక్షలకు చేరింది…ఈ వివరాలని అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది అమెరికాలో ఉండే విదేశీ విద్యార్ధుల వివరాలని ఎప్పటికప్పుడు లెక్కలు కట్టే ఈ విభాగం తాజాగా ఈ ప్రకటన చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలు జాత్యహంకార దాడుల ప్రభావంవల్ల అక్కడ మన విద్యార్థుల సంఖ్య తగ్గవచ్చని రెండేళ్లుగా భావిస్తున్నా గణాంకాలు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం అధికారులకి షాక్ ఇచ్చాయి.

Idian NRI Students Proving Their Talent In America-

Idian NRI Students Proving Their Talent In America

అమెరికాలో మొత్త 12 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు వారిలో భారతీయ విద్యార్ధుల సంఖ్య 2,27,199. ఇది మొత్తం విదేశీ విద్యార్థుల్లో 18.83%. గత నాలుగున్నర సంవత్సరాల్లో మన విద్యార్థుల సంఖ్య రెట్టింపయింది. 2014 ఏప్రిల్‌లో 1.13 లక్షలు ఉండగా ఇప్పుడు 2.27 లక్షలకు పెరిగింది. భారతీయ విద్యార్థుల్లో 67% బాలురు, 33% బాలికలున్నారు. 77.6% మాస్టర్స్‌ డిగ్రీ (పీజీ), 9.9% బ్యాచిలర్స్‌ (డిగ్రీ), 9.6% పీహెచ్‌డీ వారున్నారు. గత ఏడాది (2017 డిసెంబరు నాటికి) 2,12,288 మంది ఉండగా, ఈ ఏడాది ఆగస్టు నాటికి ఆ సంఖ్య 2,27,199కి పెరిగింది. అంటే 14,911 మంది అధికం. మొత్తం 6.6% వ ద్ధి నమోదైంది.

Idian NRI Students Proving Their Talent In America-

అమెరికాలో మొత్తం భారతీయ విద్యార్థుల్లో 1,93,274 మంది (85%) సైన్స్‌…టెక్నాలజీ…ఇంజినీరింగ్‌గణితం (స్టెమ్‌) కోర్సుల్లోనే ప్రవేశాలు పొందుతున్నారు. వారిలో 69.8% బాలురు ఉండగా 30.2% బాలికలున్నారు. మొత్తం స్టెమ్‌ విద్యార్థుల్లో 83.1% ఎంఎస్‌(పీజీ) చేసేవారే.