వంశీకి ఆ గుర్తింపు ! సంచలన విషయం చెప్పిన స్పీకర్

తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వల్లభనేని వంశీ రాజీనామా చేసిన అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలపై టిడిపి ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ఆయనపై సస్పెన్షన్ వేటు కూడా వేసిన సంగతి తెలిసిందే.ఆ తరువాత టిడిపి నాయకులు వర్సెస్ వంశీ అన్నట్టుగా వాదులాటలు జరుగుతూనే ఉన్నాయి.

 Identity As An Independent Mla For Vamsi-TeluguStop.com

ఆయన శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయాల్సిందేనంటూ తెలుగుదేశం పట్టుబడుతోంది.వంశీ కూడా బిజెపికి లోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుల విషయంలో మీరు ఎందుకు ఈ విధంగా డిమాండ్ చేయలేదు అంటూ ప్రశ్నించారు.

ఇదిలా ఉండగానే వంశీ శాసనసభ్యత్వం విషయంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు.ఏ ఎమ్మెల్యే అయినా పార్టీ మారాలనుకుంటే తమ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందేనని ఆయన అన్నారు.

అలా కాకుండా పార్టీ మారితే అనర్హత వేటు పడుతుందని, ఈ విషయంలో సీఎం జగన్ తాను ఒకే విధంగా ఆలోచిస్తున్నామని అన్నారు.

వంశీనీ సస్పెండ్ చేసినా ఆయన మరో పార్టీలోకి వెళ్లకుండా ఉంటే స్వతంత్ర ఎమ్మెల్యే గా గుర్తించేందుకు వీళ్లు ఉంటుందంటూ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు.

పార్టీ ఫిరాయింపుల విషయంలో అందరికీ ఇదే సూత్రం వర్తిస్తుంది తమ్మినేని క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube