ఈ లక్షణాలుంటే బ్లాక్‌ ఫంగస్‌ అని గుర్తించండి.. !

ప్రస్తుతం దేశంలోని ప్రజల జీవితాలు గాలిలో దీపాలుగా మారిపోయాయి.ఏ క్షణం మాయదారి కరోనా అంటుకుని ప్రాణాలు తీస్తుందో అర్ధం కాని స్దితిలో ప్రజలు బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.

 Black Fungus Symptoms, Identify, Symptoms, Black Fungus, Recovered, Corona Patie-TeluguStop.com

ఇక కరోనా సోకి ఈ వైరస్ బారినుండి బయటపడిన వారిపాలిట మరో సమస్య ప్రాణాంతకంగా మారుతుందట.దాని పేరే బ్లాక్‌ ఫంగస్‌.

ఇప్పుడు ప్రజలను బయపెడుతున్న మరో మాయదారి రోగం ఇదని అంటున్నారు.

ఇక కరోనా నుంచి కోలుకొన్న వారిపై, ప్రస్తుతం కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారిపై బ్లాక్‌ ఫంగస్‌ దాడి(మ్యూకోర్‌ మైకోసిస్‌) వల్ల కంటి చూపు మందగించడం, ముఖంలో ఒక వైపు భాగం నొప్పిగా ఉండటం, పంటి నొప్పి, ఛాతి నొప్పి, ఊపిరి సమస్యలు వంటివి తలెత్తుతున్నాయట.

ఒకవేళ కరోనా నుండి కోలుకున్న వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్టు అనుమానించాలని, ఈ ఫంగస్‌ గాలిలో ఉంటుందని, శ్వాస తీసుకున్నప్పుడు శరీరంలో చేరి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారిలో వృద్ధి చెంది ప్రమాదకరంగా మారుతుందని కేంద్రం తన అడ్వైజరీలో సూచిస్తుంది.

ఇక ఈ బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలను పరిశీలిస్తే.

కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబడటం, నొప్పి, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి సమస్యలు, వాంతిలో రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయట.కాబట్టి ఈ మ్యూకోర్‌ మైకోసిస్‌ లక్షణాలను తేలికగా తీసుకోవద్దని వెంటనే వైద్యులను సంప్రదించాలని వెల్లడిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube