ఎమ్మెల్యే గ‌ద్దె దంప‌తుల ఆద‌ర్శం.. టీడీపీ నుంచి మొట్ట‌మొద‌టి సారిగా...!

గంగిగోవు పాలు గ‌రిటెడైన చాలు.అన్న సూత్రాన్ని అక్ష‌రాలా నిజం చేస్తున్నారు టీడీపీ నాయ‌కులు.తాము ఆద‌ర్శంగా ఉంటూ .స‌మాజాన్ని కూడా ఆద‌ర్శంగా ఉంచేలా కృషి చేస్తున్నారు.ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని ఇంకా వీడిపోలేదు.మ‌న దేశంలోనూ ఇంకా తీవ్ర‌త కొన‌సాగుతోంది.మ‌రీ ముఖ్యంగా మ‌న రాష్ట్రంలోనూ సెకండ్ వేవ్‌(రెండో ద‌శ) పొంచి ఉంద‌ని ప్ర‌భుత్వం కూడా చెబుతోంది.ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర్కొనాలో తెలియ‌క అల్లాడిపోతున్నారు.

 Ideal Of Mla Gadde Couple For The First Time From Tdp-TeluguStop.com

అయితే .క‌రోనాను అంతం చేసేందుకు ప్ర‌యోగాలు సాగుతూనే ఉన్నాయి.ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే సీరం కంపెనీ నుంచి ఫైజ‌ర్ టీకా అందుబాటులోకి వ‌చ్చింది.

అయితే.

 Ideal Of Mla Gadde Couple For The First Time From Tdp-ఎమ్మెల్యే గ‌ద్దె దంప‌తుల ఆద‌ర్శం.. టీడీపీ నుంచి మొట్ట‌మొద‌టి సారిగా…-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టీకా ప్ర‌యోగ ద‌శ‌లోనే ఉంది.ప్ర‌స్తుతం మ‌నుషుల‌పై ప్ర‌యోగాల‌కు శాస్త్ర‌వేత్త‌లు రెడీ అయ్యారు.

ఇప్ప‌టికే దేశంలో అనేక మంది యువ‌త ముందుకు వ‌చ్చి.టీకా ప్ర‌యోగాల‌కు సిద్ధ‌మ‌య్యారు.

ఈ క్ర‌మంలో సాధార‌ణంగా రాజ‌కీయ నేత‌లు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు.మేమున్నాం.

అంటూ ముందుకు వ‌చ్చి టీకా ప్ర‌యోగాల్లో ముందు త‌మ‌పైనే ప్ర‌యోగాలు చేయండి.అంటూ చెప్పిన నాయ‌కులు చాలా చాలా త‌క్కువ‌గా ఉన్నారు.

మ‌రీ ముఖ్యంగా మ‌న రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ముందుకు రాలేదు.అదే ప‌దవులు పంచుకోవ‌డంలోను, ఆదాయం వ‌చ్చే రంగాల‌ను పంచుకోవ‌డంలోను నాయ‌కులు ముందుకు వ‌స్తున్నారు త‌ప్ప‌.

ఇలాంటి స‌మాజ హిత కార్య‌క్ర‌మాల‌కు ముందుకు వ‌చ్చే నేత‌లు క‌నిపించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వున్నాయి.

అయితే.ఇప్పుడు ఇలాంటి విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడుతూ.టీడీపీకి చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం.

భార్యా భ‌ర్త‌లు ముందుకు వ‌చ్చారు.కృష్నాజిల్లా కు చెందిన గ‌ద్దె రామ్మోహ‌న్‌, అనురాధ దంప‌తులు దాదాపు 30 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు.

ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపు గుర్రం ఎక్కారు.ఇక‌, అనురాధ కృష్ణా జెడ్పీ చైర్ ప‌ర్స‌న్‌గా సేవలు అందించారు.

స్వ‌త‌హాగా ఎమ్మెస్సీ చేసిన రామ్మోహ‌న్‌కు అనేక ఫ్యాక్ట‌రీలు కూడా ఉన్నాయి.ఇప్పుడు ఈ దంప‌తులు.

స‌మాజ దృష్టిలోనూ అనేక ఆలోచ‌న‌లు చేస్తార‌నే పేరుంది.ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ ప‌డే కార్య‌క్ర‌మాల‌కు ఈ దంప‌తులు ఎప్పుడూ ముందుంటారు.

ఇప్పుడు కూడా వారు ముందుకు వ‌చ్చారు. సీరం టాకాను ఏపీలో తొలిగా తాము తీసుకుంటామ‌ని తెలిపారు.త‌మ‌పై ప్ర‌యోగం చేయాల‌ని సీరం సంస్థ‌కు లేఖ రాసిన‌ట్టు చెప్పారు.దీనికి ఆ సంస్థ ఓకే అంటే.

రాష్ట్రంలో తొలి టీకా ప్ర‌యోగం టీడీపీకి చెందిన రాజ‌కీయ కుటుంబంపైనే జ‌ర‌గ‌నుంది.మ‌రి ఇంత ఆద‌ర్శ‌వంత‌మైన దంప‌తుల‌ను అభినందించ‌కుండా ఉండ‌గ‌ల‌రా?! ఇప్పుడు సోష‌ల్ మీడియాలో అభినంద‌నల వెల్లువ సాగుతోంది.

#TDP #Gadde #AP #Ysrcp #Krishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు