'ఐడియా టు స్క్రిప్ట్' అనే రైటర్స్ వర్క్‌షాప్‌ను లాంచ్ చేస్తున్నఅన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా

భారతీయ సినిమాలో తమ సత్తా చాటాలనుకొనే ఔత్సాహిక రచయితలందరి కోసం ‘ఐడియా టు స్క్రిప్ట్’ అనే రైటర్స్ వర్క్‌షాప్ నిర్వహించేందుకు.‘బాహుబలి’, ‘బజ్‌రంగి భాయిజాన్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల సుప్రసిద్ధ స్క్రిప్ట్ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో చేతులు కలుపుతున్నట్లు ఏసీఎఫ్ఎం ప్రకటించింది.స్క్రిప్ట్‌రైటింగ్‌లో ఆసక్తి ఉన్నవారికోసం 2020 సంవత్సరంలో మంచి ఆరంభం ఇవ్వడానికి ఈ ఎక్స్‌క్లూజివ్ వర్క్‌షాప్‌ను ఏసీఎఫ్ఎం డైరెక్టర్ శ్రీమతి అమల అక్కినేని ప్రకటించారు.“విజయేంద్రప్రసాద్ గారి కలం కోట్లాది హృదయాల్ని గెలుచుకుంది.ప్రతిసారీ బాక్సాఫీస్ విజయాల్ని అందించింది.‘బాహుబలి’ ఫ్రాంచైజ్ భారతీయ చిత్రసీమకు గొప్ప గుర్తింపు తీసుకొచ్చింది.ఆయన కథలెప్పుడూ లార్జర్ దేన్ లైఫ్‌లా ఉంటాయి.తన స్టోరీలైన్ ద్వారా భావోద్వేగాల్ని కలిగించి ప్రేక్షకుల్ని అలరించడంలో ఆయన దిట్ట” అని ఆమె చెప్పారు.

 Idea To Script Writers Workshop At Annapurna Studios Hyd-TeluguStop.com
Telugu Ideascript, Amala Akkineni-Press Releases

మాస్టర్ స్క్రిప్ట్ రైటర్ అయిన కె.వి.విజయేంద్రప్రసాద్ నుంచి కమర్షియల్ సక్సెస్ స్క్రిప్ట్ రైటింగ్‌లోని మెళకువల్ని నేరుగా నేర్చుకొనే అరుదైన సదుపాయాన్ని కల్పిస్తున్నామంటూ, తదుపరి బ్లాక్‌బస్టర్ కోసం స్క్రిప్టు రూపకల్పనలో భాగం పంచే ఈ వర్క్‌షాప్‌లో పాలుపంచుకోవాల్సిందిగా రచయితలనూ, ఔత్సాహిక ఫిలింమేకర్స్‌నూ ఆమె ఆహ్వానించారు.

Telugu Ideascript, Amala Akkineni-Press Releases

విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ “ఎంత థీరిటికల్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ, అది ప్రాక్టికల్‌గా ఏమంత ఉపకరించదు.కథలనేవి ఒక ఐడియాతో మొదలై, డెవలప్ అవుతాయి.ఒక మంచి ఐడియాను ఎలా గ్రహించాలో, దాన్ని ప్రభావవంతమైన ఒక కథగా ఎలా మలచాలో, దానికి ప్రాణం ఎలా పోయాలో స్క్రిప్ట్‌రైటింగ్ నేర్పిస్తుంది.

మన పరిసరాల్ని ఎంత పరిశీలనా దృష్టితో చూస్తే, ఎంత సున్నితంగా మనం మారగలిగితే, ఒక శక్తిమంతమైన స్టోరీని నెరేట్ చేయగల సామర్థ్యం అంతగా మనకు అలవడుతుంది” అని తెలిపారు.

ఈ వర్క్‌షాప్ 2020 జనవరి ఆరంభంలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహింపబడుతుంది.

ఎక్వైరీ కోసం 1 800 57 24746 నంబర్‌కు కాల్ చేయండి.లేదా [email protected] కు మెయిల్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube