Idea: అక్కడ కొబ్బరి చిప్పల్లో చాయ్ ఇస్తారు.. ఐడియా అదుర్స్ కదూ?

ఆలోచనే వుండాలిగాని, మనం చేసే పనితో ఎదుటివారిని ఇట్టే కట్టి పడేయవచ్చు.అవును.‘కవితకు కాదేది అనర్హం’ అన్నాడు ఓ మహానుభావుడు.సరిగ్గా అలాంటి ఆలోచనే చేసాడు ఓ చాయ్ వాలా.

 Idea There They Serve Chai In Coconut Shells Does The Idea Sound Good-TeluguStop.com

అందరిలాగా చాయ్‌ను గ్లాసుల్లోనో, కప్పుల్లోనో ఎందుకివ్వాలని ఆలోచించాడు.కొత్తగా ట్రై చేయాలని ప్రకృతి వైపు తొంగి చూసాడు.

అంతే.ఓ అద్భుతమైన ఆలోచన తట్టింది.

ఇంకేముంది ఆచరణలో పెట్టేసాడు.అవును అతడు తయారు చేసే ఛాయ్ ని కొబ్బరి చిప్పల్లో అమ్ముతున్నాడు.

అయితే అతడు ఐడియా వరకే పరిమితం కాలేదు.ఛాయ్ టేస్ట్ కూడా అదుర్స్ అనిపించేలా ఉంటుందని అక్కడ తాగే కస్టమర్లు చెబుతున్నారు.

దాంతో బిజినెస్ కూడా క్లిక్ అవ్వడంతో మనోడు మంచి పాపులర్ అయ్యాడు.అతడి పేరు దీనా.6 నెలల క్రితం చెన్నైలోని మెరీనా బీచ్‌ లో టీ షాప్ పెట్టాడు.అయితే మొదట్లో అందరిలాగే గ్లాసుల్లో, కప్పుల్లో కాఫీ, టీ అమ్ముతుండేవాడు.

కానీ పర్యావరణ అనుకూల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు కొబ్బరి చిప్పల్లో కాఫీ, టీ అందించాలని ఓ దృఢ నిశ్చయం తీసుకున్నాడు.ప్రత్యేకంగా కొబ్బరి చిప్పలను తయారు చేయడానికి కొంతమంది వ్యక్తులను నియమించుకున్నాడు.

రోజుకు దాదాపు 60- నుంచి 70 కప్పులను ఉపయోగిస్తున్నట్లుగా దీనా తెలిపాడు.

Telugu Chaicoconut, Chennai, Coconut, Dina, Marina Beach, Tea Shop, Latest-Lates

అయితే అతనిలో మరో గొప్ప క్వాలిటీ కూడా ఉంది.ప్రతి సోమవారం ఒక కప్పు బ్లాక్ కాఫీని కేవలం ఒక రూపాయికి మాత్రమే అందిస్తాడు.దీనా ఛాయ్ మాస్టర్ మాత్రమే కాదు, తనలో ఓ రైటర్ కూడా వున్నాడు.

సినిమాలంటే అతగాడికి విపరీతమైన పిచ్చి.సినిమాలకు మాటలు రాయాలనే కోరిక అతనికి ఉందట.“నేను కొబ్బరి చిప్పలపై టీని అందించాలని అనుకున్నాను.గాజు మరియు కాగితపు కప్పులతో పోలిస్తే కొబ్బరి పెంకు సేంద్రీయంగా ఉంటుంది” అని దీనా చెప్పడం అందరినీ ఆలోచింపజేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube