జియో ప్లాన్‌ రివర్స్‌ అయ్యింది

ఇండియాలో నెం.1 టెలికాం సర్వీస్‌గా నిలబడేందుకు జియో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.రెండేళ్ల క్రితం ఉచిత కాల్స్‌తో జనాల ముందుకు వచ్చిన జియో టెలికాం రంగంలో పెను మార్పులు తీసుకు వచ్చింది.కేవలం డేటాకు మాత్రమే డబ్బులు చెల్లిస్తే చాలు, కాల్స్‌ ఉచితంగా చేసుకోండి అంటూ జియో ప్రకటించింది.

 Idea And Vodafone Give The Surprise To Jio Service-TeluguStop.com

కాని ఇటీవల జియో నిమిషానికి ఆరు పైసలు వసూళ్లు చేయబోతున్నట్లుగా ప్రకటించింది.రెండేళ్లలోనే జియో తన మాట మార్చుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.వినియోగదారుల నుండి ఐయూసీ చార్జీల రూపంలో నెలలో దాదాపుగా 100 కోట్ల మేరకు వసూళ్లు చేయాలని జియో భావిస్తుంది.

ప్రస్తుతం నెం.2గా ఉన్న జియో తీసుకున్న ఈ నిర్ణయంతో వినియోగదారుల సంఖ్య తగ్గే అవకాశం కూడా ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.ఇదే సమయంలో జియోకు మొదటి నుండి గట్టి పోటీ ఇస్తూ నెం.1 స్థానంలో ఉన్న ఐడియా వోడాఫోన్‌ సంస్థ మాత్రం ఐయూసీ చార్జీలు తాము వసూళ్లు చేయబోవడం లేదు అంటూ ప్రకటించింది.కేవలం డేటాకు మాత్రమే డబ్బులు వసూళ్లు చేసి కాల్స్‌ను పూర్తి ఉచితంగా ఇస్తామని, ఐయూసీ చార్జీలను తామే భరిస్తామని వినియోగదారులకు హామీ ఇచ్చింది.

ఐయూసీ చార్జీలతో కోట్లు సంపాదించాలనుకున్న జియోకు వోడాఫోన్‌ ఐడియా ఇచ్చిన షాక్‌తో మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube